ఇలా మీ పళ్ళని తెల్లగా మార్చుకోండి..!

-

ఆరోగ్యకరమైన పళ్ళు ఎప్పుడూ అందంగా ఉంటాయి. అలాగే అందమైన పళ్ళు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటాయి. అందుకని ఈ పళ్ళు అందంగా ఉండడానికి మీరు రోజులో పది నిమిషాలు పంటి శుభ్రత కోసం వెచ్చిస్తే మంచిది. దీనితో ఆరోగ్యకరమైన పళ్ళు, అందమైన పళ్ళు మీ సొంతమవుతాయి. అయితే చాలా మంది పళ్ళని తెల్లగా మార్చుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పళ్ళు తెల్లగా అవ్వాలంటే ఈ ఆహారపదార్థాల ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. అయితే తెల్లటి పళ్ళు ఎలా సొంతం చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. మరి ఆలస్యం ఎందుకు దీనికోసమే పూర్తి చూసేయండి.

స్ట్రాబెర్రీస్:

స్ట్రాబెర్రీస్ లో మాలిక్ యాసిడ్ అనే వైట్నింగ్ ఎంజైమ్ ఉంటుంది. దీనిని తినడం వల్ల అందమైన నవ్వు మీ సొంతం అవుతుంది. లేదు అంటే మీరు స్ట్రాబెరీ ని డైరెక్ట్ గా మీ పంటిపై రుద్దండి. ఇలా చేయడం వల్ల కూడా మీరు మంచి మార్పును గమనించవచ్చు.

అరటి పండ్లు:

అరటి పండులో పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ మొదలైనవి సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మీరు అరటిపండు తొక్క లోపలి భాగం తో పళ్ళని రుద్దితే కచ్చితంగా మీ పళ్ళు తెల్లగా వస్తాయి.

క్రాన్ బెర్రీస్:

క్రాన్ బెర్రీస్ కూడా పంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. పళ్ళు తెల్లగా మార్చడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. కాబట్టి మీరు కావాలంటే క్రాన్ బెర్రీస్ కూడా ప్రయత్నం చేయొచ్చు.

ఆపిల్:

ఆపిల్ తో కూడా మీ పళ్ళు తెల్లగా అవుతాయి. బ్యాక్టీరియా ద్వారా ఏర్పడే కేవిటీ సమస్యని ఇది తొలగిస్తుంది. కాబట్టి మీ పళ్ళని అందంగా ఆరోగ్యంగా ఉండటానికి యాపిల్ ని కూడా వాడండి. చూసారు కదా ఈ సులువైన చిట్కాలు. మరి వీటిని ఫాలో అయ్యి ఏ సమస్య లేకుండా ఉండండి. అలానే మీ పళ్ళని మరింత తెల్లగా మార్చుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version