పెనం మీద జిడ్డు పోయి బాగా క్లీన్ అయిపోవాలంటే… ఇలా చేయండి..!

-

పెనం మనం వాడేటప్పుడు ఆయిల్ వంటివి వేస్తుంటాము. దాంతో పెనం జిడ్డుగా మారిపోతుంది ఇలా చేస్తే ఈజీగా పెనం మీద జిడ్డు తొలగిపోతుంది. దోస, చపాతీ మొదలైన టిఫిన్స్ ని మనం పెనం మీద చేసుకుంటూ ఉంటాము దీంతో పెనం బాగా జిడ్డుగా మారిపోతుంది క్లీన్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది. ఇనుప పెనాన్ని మీరు ఉపయోగిస్తున్నట్లయితే దాని మీద ఉండే జిడ్డుని ఇలా సులభంగా తొలగించుకోవచ్చు.

 

మామూలుగా వంట పాత్రలని తోమినట్లుగా ఒక సారి పెనాన్ని తోమితే దాని మీద జిడ్డు పోదు కానీ పెనం మీద జిడ్డు పోవాలంటే ఇలా చేయొచ్చు. నిమ్మకాయని సగానికి కోసి ఉప్పు రాసి దానిని పెనం మీద జిడ్డు ఉన్న చోట రుద్దారంటే ఐదు నిమిషాల్లో జిడ్డు అంతా కూడా పోతుంది పెనం తెల్లగా వస్తుంది. క్లీన్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఇలా క్లీన్ చేసాక గోరువెచ్చని నీళ్ళతో పెనాన్ని శుభ్రంగా కడిగేసుకుంటే జిడ్డు అంతా కూడా పోతుంది.

వెనిగర్ ని కూడా మీరు పెనాన్ని కడగడానికి వాడొచ్చు. పెనం మీద జిడ్డుని వదిలించడానికి వెనిగర్ బాగా సహాయపడుతుంది ఒక గిన్నెలో నీళ్లు వేసి వెనిగర్ వేసి స్పాంజ్ ముంచి పెనం మీద జిడ్డు ఉన్నచోట రాయండి ఇలా రుద్దితే కూడా సులభంగా జుట్టు మొత్తం పోతుంది. ఇలా ఈ రెండు విధాలుగా మీరు పెనం మీద జిడ్డుని సులభంగా తొలగించుకోవచ్చు పెనం బాగా క్లీన్ అయిపోతుంది. ఈసారి ఎప్పుడూ కూడా పెనం మీద జడ్డుని వదిలించుకోవడానికి కష్టపడక్కర్లేదు ఇలా సింపుల్ గా పాటిస్తే పెనం మీద జిడ్డు ఈజీగా పోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version