ఏపీలో నిన్నటి నుంచి పెన్షన్ పంపిణీ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. స్వయంగా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా… పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. అయితే… ఈ తరుణంలో ఏపీలో దారుణం జరిగింది. పెన్షన్ సొమ్ము తీసుకొని సచివాలయ ఉద్యోగి పరార్ అయ్యాడు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
7.50 లక్షల పెన్షన్ డబ్బులు తీసుకుని… తోట తరుణ్ కుమార్ అనే సచివాలయ ఉద్యోగి పారిపోయినట్లు తాజాగా గుర్తించారు. గంపలగూడెం మండలం పెనుగోలను గ్రామంలో తరుణ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇలాంటి సంఘటనలు కేవలం ఏపీలోనే జరుగుతున్నాయి. తాజాగా మరో ఉద్యోగి కూడా పెన్షన్ డబ్బులతో పారిపోయాడు.