ఇవాళ పార్లమెంట్ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు రానుంది. తొలుత లోక్సభ ఆ తర్వాత రాజ్యసభలో ఈ బిల్లును కేంద్ర సర్కార్ ప్రవేశపెట్టబోతోంది. బిల్లుపై చర్చకు ఎనిమిది గంటలకు కేటాయించింది బిజెపి సర్కార్. దీనిపై 12 గంటలు చర్చలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ బిల్లును కాంగ్రెస్, తృనములు కాంగ్రెస్, సమాజ్వాది పార్టీ అలాగే ఎంఐఎం పార్టీ, డీఎంకే కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
అయితే ఈ బిల్లు లోక్సభ ముందుకు వస్తున్న నేపథ్యంలో ఎంపీలందరికీ బిజెపి అలాగే కాంగ్రెస్ పార్టీలు విప్ జారీ చేశాయి. నేటి నుంచి మూడు రోజులపాటు సభకు హాజరుకావాలని బిజెపి అలాగే కాంగ్రెస్ పార్టీలో ఆదేశాలు ఇచ్చాయి. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఈ బిల్లు సవరణపై చర్చ ప్రారంభమవుతుంది.