టమాటా కెచప్ తో రాగి పాత్రలను ఇలా మెరిపించేయండి ..!

-

రాగి వస్తువులను వాడటం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ వీటిని రెండు రోజులకు ఓసారి అయినా క్లీన్ చేసుకోవాలి. లేదంటే అస్సలు బాగుండవు. నల్లగా అయిపోతాయి. పూజగదిలో, వంటగదిలో ఉండే వెండి పాత్రలను క్లీన్ చేయడానికి కొన్ని హోం రెమిడీస్ ఉన్నాయి. వాటితో ఈజీగా.. పాత్రలను తళతళ మెరిసేలా చేయొచ్చు.

ఉప్పు, వెనిగర్‌లను రాగి వస్తువుల మీద వేస్తే రాగి ఆక్సీకరణం చెందడాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల అది నల్లగా మారకుండా ఉంటుంది. ఉప్పు, వెనిగర్‌ల మిశ్రమాన్ని వేసి రాగి పాత్రలను గట్టిగా రుద్దాలి. మురికి నెమ్మదిగా తొలగిపోతూ ఉంటుంది. పూర్తిగా పోయేవరకు రుద్దండి. తర్వాత కడిగేసి మెత్తని గుడ్డతో తుడిచేయండి.

ఒక పెద్ద గిన్నెలో నీళ్లు తీసుకోండి. ఆ నీళ్లలో టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక కప్పు వెనిగర్ వేసి బాగా కలపండి. అవి కరిగిపోయాక అందులో రాగి సామాన్లను వేయండి. తర్వాత దీన్ని స్టౌ మీద పెట్టండి. నీళ్లు మరిగేవరకు అలాగే ఉంచండి. మురికి మొత్తం నీళ్లలోకి వచ్చేస్తుంది. మీ వస్తువులు క్లీన్‌గా మారిపోతాయి. చల్లగా అయిన తర్వాత తీసి సబ్బుతో క్లీన్ చేసేయండి. తర్వాత క్లాత్ తో తుడవడం మాత్రం మర్చిపోకండే..

నిమ్మకాయతో రాగి వస్తువులను సులభంగా శుభ్రం చేసేయొచ్చు. నిమ్మకాయను సగానికి కోసి, ఒక ముక్కతో రాగి వస్తువులను తోమండి. దీనివల్ల మురికి తొందరగా తొలగిపోతుంది.

నిమ్మరసాన్ని గిన్నెలోకి పిండండి. అందులో ఉప్పువేసి కలపండి. ఈ మిశ్రమంలో ఒక మెత్తని గుడ్డని ముంచి దాంతో రాగి వస్తువులు క్లీన్ చేయడం వల్ల తొందరగా శుభ్రమవడమే కాదు. ఎలాంటి గీతలూ పడకుండా కూడా ఉంటాయి.

కెచప్‌తో కూడా రాగి వస్తువులను క్లీన్ చేసుకోవచ్చు. వినడానికి వింతగా ఉన్నా..ఇది నిజమండి బాబూ..రాగి వస్తువుల మీదున్న కఠినమైన మరకలను కూడా ఇది తొలగిస్తుంది. కెచప్‌ని ఒక గిన్నెలోకి తీసుకోండి. కొద్దికొద్దిగా తీసుకుంటూ రాగి వస్తువులకు పూయండి. ఒక సన్నని పొర మాదిరిగా పూర్తిగా ఎక్కడా వదలకుండా పూయండి. దీన్ని ఒక పది నిమిషాలు అలాగే ఉంచిన తర్వాత మెత్తని గుడ్డతో బాగా రుద్దండి. తర్వాత దాన్ని వేడినీటితో కడిగి, శుభ్రంగా తుడిచేయండి. రాగి పాత్రలు తళతళా మెరిసిపోతాయి. ఇంట్లో ఎక్స్పైరీ అయిన కెచప్ తో ఇలా చేసేయొచ్చు కదా..!

Read more RELATED
Recommended to you

Exit mobile version