విద్యార్థులకు శుభవార్త.. మే 9 నుంచి వేసవి సెలవులు

-

ఆంధ్ర ప్రదేశ్‌ విద్యార్థులకు శుభవార్త. మే 9 వ తేదీ నుంచి వేసవి సెలవులు ఉండనున్నట్లు ఏపీ విద్యాశాఖ ప్రకటన చేసింది. ఏప్రిల్‌ మాసం 27 వ తేదీ నుంచి మే 9 వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి. ఈ పదో తరగతి పరీక్షలు పూర్తి కాగానే.. వేసవి సెలవులు ప్రకటించనున్నారు.

1 నుంచి 9 వ తరగతులకు జరగాల్సిన సమ్మేటివ్‌ – 2 పరీక్షలు ఏప్రిల్‌ మాసం 22 వ తేదీ నుంచి మే 4 వ తేదీ వరకు జరుగనున్నాయి. అవి కాగానే.. వాళ్లకు సెలవులు ఉంటాయి. జూలై 4 వ తేదీ నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇక జూనియర్‌ కాలేజీలకు మే 25 వ తేదీ నుంచి జూన్‌ 20 వ తేదీ వరకు సమ్మర్‌ హాలిడేస్‌ ఇవ్వాలని ఏపీ విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version