నాటు ఆవు జున్ను పాలతో సంవత్సరానికి సరిపడా విటమిన్ D

-

విటమిన్ డీ ఎండ నుంచి అందుతుంది. కానీ ఈరోజుల్లో ఎండ తగలకుండానే డే గడిచిపోతుంది. ఆఫీసుల్లో పనిచేసుకునే వాళ్లకు ఎండలో ఏం పని ఉంటుుంది చెప్పండి. ఇంట్లో ఏసీ, ఆఫీసుల్లో ఏసీ.. బయటకు వెళ్తే కారు ఇక అలాంటివారికి ఎండ తగిలే అవకాశం ఉండదు. దీంతో చాలామంది విటమిన్ డీ లోపం భారిన పడుతున్నారు. ఎవరి బాడీలో అయితే విటమిన్ డీ లోపిస్తుందో.. వారిలో ఎముక ఆరోగ్యం క్షీణిస్తుంది, ఎముకల నొప్పులు వస్తాయి. రక్షణ వ్యవస్థ తగ్గిపోవడం, పిల్లల్లో ఎదుగుదల సరిగ్గా లేకపోవడం, కాల్షియం వంటికి పట్టకపోవడం లాంటి సమస్యలు వస్తాయి. 100లో 90 మందికి విటమిన్ డీ లోపం ఉంటుంది. ఈరోజు మనం విటమిన్ డీ ఎక్కువగా ఉండే ఆహారం గురించి చూద్దాం.

సాధారణంగా ఆహారాల ద్వారా విటమిన్ డీ అందుతుంది కానీ.. ఎక్కువ మొత్తంలో ఉండదు. శాఖాహారాల్లో విటమిన్ d2గా ఉంటుంది. జంతుసంబంధమైన ఆహారాల్లో విటమిన్ d3గా ఉంటుంది. ఇది విటమిన్ Dగా కన్వర్ట్ అవ్వాలి. చాలామందిలో ఈ కన్వర్షన్ సరిగ్గా జరగటం లేదు. డైరెక్టుగా సూర్యకిరణాల నుంచి తయారుచేసుకుంటేనే విటమిన్ డీ అందుతుంది. d3గా ఉన్నది తేలిగ్గా విటమిన్ dగా కన్వర్ట్ అవుతుందని సైంటిఫిక్ గా నిరూపించారు. పాలల్లో, పెరుగు, మాంసాహారాల్లో చాలా తక్కువ ఉంటుంది. ఇది కన్వర్ట్ అయినా.. బాడీకి సరిపడా అందటం లేదు. ఇక ఈ సమస్యకు విటమిన్ డీ టాబ్లెట్ వేసుకోవడం తప్ప మరో పరిష్కారం లేదని చాలామంది అనుకుంటారు. కానీ సైంటిఫిక్ గా విటమిన్ డీని అందించే… అద్భుతమైన ఆహరం ఉందని నిరూపించారు.

2020వ సంవత్సరంలో రాష్ట్రసంథ్ తుకదోజి మహరాజ్ నగర్ యూనివర్శిటీ- మహారాష్ట్ర ( Rashtrasant Tukadoji Maharaj Nagar University- Maharashtra) వారు పరిశోధన చేసి ఇచ్చారు. టాబ్లెట్ వాడకుండా విటిమిన్ డీని నాటుఆవు జున్నపాలు. గేదె జున్నుపాలల్లో కూడా విటమిన్ డీ అంత లేదు.. కేవలం నాటు ఆవు జున్నపాల్లలోనే విటమిన్ డీ అధికంగా ఉంది. 100 గ్రాముల నాటుఆవు జున్నపాలు తీసుకుంటే.. 310 మెక్రో గ్రాములు ఉంది. మనకు ఒకరోజుకు 10 మైక్రో గ్రాములు అందిస్తే చాలు.

ఈ జున్నుపాలు ద్వారా విటమిన్ d3ని బాడీకి అందిస్తే.. అది ప్రేగుల నుంచి లివర్ కి వెళ్లి విటమిన్ డీ గా కన్వర్ట్ అయి కిడ్నీలకు పంపిస్తుంది. కిడ్నీలు రక్తంలోపలకి వదిలేస్తాయి. కాబట్టి నెలకు రెండుసార్లు కప్పుడు చొప్పున పాలు లేదా జున్ను తిన్నా విటమిన్ డీ పుష్కలంగా అందుతుంది. విటమిన్ 6నెలల నుంచి సంవత్సరం పాటు బాడీలో రిజర్వ్ చేసుకునే గుణం ఉంది. మనం ఎక్కువ తీసుకున్నప్పుడు బాడీ స్టోర్ చేసుకుంటుంది. కొన్ని సాలిబుల్ విటమిన్స్ ఉంటాయి.. అవి ఎక్కువగా తీసుకున్నప్పుడు మోషన్ ద్వారా వచ్చేస్తాయి. విటమిన్ డీ అలా కాదు.. కాబట్టి మనకు దొరికినప్పుడల్లా తీసుకుంటే… విటమిన్ డీ గా లివర్ కన్వర్ట్ చేసి శరీరానికి అందిస్తుంది.

నాటు ఆవు జున్నపాలల్లో మొదట ఒకటి రెండు రోజుల్లో వచ్చే పాలల్లోనే ఇంత మొత్తంలో విటమిన్ d3 ఉందని సైంటిస్టులు ఇచ్చారు. జెర్సీ ఆవు పాలల్లో లేదు. విటమిన్ డీ కోసం టాబ్లెట్ వాడేవాళ్లు ఉంటే.. టాబ్లెట్ వాడుతునే.. రెండు నెలల పాటు నాటు ఆవు జున్ను పాలను రెండు మూడుసార్లు అయినా వాడి.. ఇక టాబ్లెట్ మానేయొచ్చు. తర్వాత కొన్ని నెలలకు టెస్ట్ చేసుకుంటే.. మీకు సరిపడా ఉంది అంటే.. ఇక పూర్తిగా మానేయొచ్చు. కొందరిలో బాడీలో మెకానిజం సరిగ్గా ఉండక.. విటమిన్ d3 విటమిన్ dగా కన్వర్ట్ అవదు. అలాంటి వారు టాబ్లెట్ ను వాడాల్సి ఉంటుంది. అయితే అందిరిలో ఇది జరగదు. పదిలో ఒక్కరకే.. ఇలా కన్వర్ట్ కాకుండా ఉంటుంది.

మొదటు రెండు రోజుల్లో వచ్చే నాటు ఆవు జున్నపాలనే వాడాలని గుర్తుంచుకోండి. సైంటిఫిక్ గా ప్రూవ్ చేశారు కాబట్టి.. లోపం ఉందా లేదా అనేది పక్కనపెట్టి దొరికినప్పుడు మాత్రం వదలకుండా తీసుకోండి.!

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version