కరోనా మహమ్మారి కారణంగా దాదాపు అన్ని కంపెనీలు తమ ఆఫీసులకు తాళాలు వేసి.. ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయించటం మొదలుపెట్టాయి. దీని ద్వారా పొద్దున్నే లేవటం, హడావిడీగా రెడీ అవటం.. లంచ్ బాక్స్ లో ఏదో ఒకటి వేసుకుని బస్సులకో, మెట్రోలకో అది కాకుంటే సొంత వాహనాల్లోనే ట్రాఫిక్ సమస్యను దాటుకుంటూ ఆఫీసులకు వెళ్లే బాధతప్పింది. ఇక్కడ వరకూ సీన్ బానే ఉంది..కానీ ఇంటినుంచే పని చేయటంలో అసలు తిప్పలేంటో తెలుసా.. ఎందుకు తెలియదు సంవత్సరం పైగానే చేస్తున్నాం కదా అనుకుంటున్నారా.. అవును మరి..వర్క్ ఫ్రం హోం కాయిన్ కి ఒకసైడ్ చాలా బాగుంటుంది.. రెండో సైడ్ పరిస్థితే వర్ణణాతీతం. అందులో మొదటి సమస్య బరువు పెరగటం.
వర్క్ ఫ్రం హోం లో భాగంగా ఎదురయ్యే సమస్యలు
• బరువు పెరగటం
• పొట్ట ఎక్కువగా రావటం
• బ్యాక్ పెయిన్స్
• కుటుంబసభ్యుల వల్ల వర్క్ డిస్టబ్ కావటం
• బద్దకం
ఇవి మాత్రమే కాదు చెప్పుకోలేని సమస్యలు ఇంకా చాలానే ఉన్నాయి.. ముఖ్యంగా అందరికి ఎదుర్యేవి ఇవే. అయితే ఇందులో బరువు+ పొట్ట సమస్యలను పెళ్లై పిల్లలు ఉన్న వారు పెద్దగా పట్టించుకోవచ్చు.. హా రానిలే మళ్లీ ఆఫీస్ ఓపెన్ చేస్తే అదే సెట్ అవుతుంది అనుకుని లైట్ తీసుకుంటారు. కానీ పెళ్లికావల్సిన అమ్మాయిలు, అబ్బాయిలకు ఈ సమస్య వస్తే దాదాపు 90% శాతం మంది లైట్ తీసుకోరు. అదేదో కరోనా కంటే పెద్ద జబ్బే అని తెగ ఫీల్ అవుతారు. అంతే ఇక సోషల్ మీడియాలో అవి ఇవి అని తేడా లేకుండా బరువు తగ్గటం ఎలా, పొట్టం తగ్గటం ఎలా అంటూ బ్రౌజ్ చేసేస్తారు. సరే ఇంతా చేసి వాటిని ఆచరణలో పెడతారా అంటే అబ్బే నాలుగు రోజులు చేస్తారు, కొందరైతై వచ్చే వారం నుంచి చేద్దాం అంటూ వారాలు గడిపేస్తుంటారు. అన్ని కష్టాలు పడకుండా కొన్ని సింపుల్ ట్రిక్స్ తో ఈ గండం నుంచి గట్టెక్కే మార్గాలేంటో ఈరోజు మనం తెలుసుకుందాం..అన్నింటిలా వీటిని కూడా చదివి మానేయకుండా కొంచెం పాటిస్తే పొట్ట పెరగదండీ బాబూ..!
వర్క్ ఫ్రం హోం చేస్తున్నప్పుడు పాటించాల్సిన చిట్కాలు
సాధారంణా ఏ షిప్ట్ అయినా..8-9 గంటలు ఉంటుంది. కాబట్టి డ్యూటీ టైంలో గంటకు ఓసారి లేచి నిలబడి కుర్చున్న చోట అటూ ఇటూ తిరిగి మళ్లీ వర్క్ స్టాట్ చేయాలి. హ ఇది అందరూ చెప్పేదే అని లైట్ తీసుకోకండి. ఒక్కసారి అలా లేవటం వల్ల బాడీ అంతా రీఫ్రెష్ అవుతుంది. చేసి చూడండీ మీకే తెలుస్తుంది.
వర్క్ చేసే పొసిషన్ కూడా ఆఫీస్ లో ఉన్నట్లే మార్చుకోవాలి. అంటే ఒక టేబుల్ ఛైర్ ఏర్పాటు చేసుకుని చేయటం. అలా కాకుండా బెడ్ పై పడుకుని, నుల్చుని రకరకాల భంగిమల్లో చేస్తే కొవ్వు పెరుకుపోవటంతో పాటు..అనవసరమైన నొప్పులు కూడా వస్తాయి.
రోజు సాయంత్రం లేదా ఉదయం చిన్నపాటి వ్యాయామం చేయాలి. కుదిరితే కనీసం 30నిమిషాలు బాడీకి చెమటపట్టేలా ఎక్సర్ సైజ్ చేయాలి. అబ్బో ఇది మాకు కుదరదు అంటే..కనీసం 1-3 నిమిషాలైన ప్లాంక్ ఎక్సర్ సైజ్ చేయాలి. ఇది ఒక్కటి చేసినా చాలు.. బాడీ అంతటికి మంచి వ్యాయామం లభిస్తుంది. కానీ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి.. అలవాటు లేనప్పుడు ఒకేసారి మూడు నిమిషాలు ఉండొద్దు.. మొదటిరోజు నిమిషం లేదా అంతకంటే తక్కువ అయినా ఫర్వాలేదు..మెల్లిమెల్లిగా పెంచుకుంటూ పోవాలి.
వీటితో పాటు..తినటానికి గంట లేదా అరగంట ముందు ఒక గ్లాసుడు నీళ్లు తాగాలి. అప్పుడు ఎక్కువగా తినాలి అనే కోరిక రాదంట. తిన్న వెంటనే నిద్రపోవటం లేదా చిరుతిళ్లు లాంటివి తినటం చేయకూడదు. మధ్యాహ్న నిద్ర చాలా ప్రమాదం. భవిష్యత్తులో గుండెసమస్యలు రావటానికి కూడా కారణం అని వైద్యులు అంటారు. వీలైతే మధ్యాహ్న భోజనంలో ఉడికించిన బంగాళదుంపలు కూడా తినండి. ఇవి తినటం వల్ల కూడా ఎక్కువ భోజనం చేయాలని కోరిక ఉండదట.
మీకు తెలుసా.. అల్పాహారం మన ఆరోగ్యంలో కీలకపాత్ర పోషిస్తుందట. అందుకే బ్రేక్‌ఫాస్ట్ కాస్త ఎక్కువగా తింటే అధిక కొవ్వు కరిగి బరువు తగ్గుతారని వైద్య నిపుణులు చెబుతుంటారు. మనలో చాలా మంది బ్రేక్‌ఫాస్ట్ ని స్కిప్ చేసేస్తుంటారు. ఇప్పటినుంచైనా ఆ పద్ధతి మానేయండి.
వీటితోపాటు.. అలా వంటగదిలోకి వెళ్లినప్పుడు రెండు లవంగాలు నోట్లో వేసుకోండి చాలు. లవంగాల్లో చాలా ఉపయోగాలు ఉన్నాయండి. రక్తంలో చెక్కెరస్థాయి తగ్గించటం, క్యాన్సర్ నుంచి రక్షించటంలోనూ బాగా ఉపయోగపడుతుంది. అన్నింటికంటే మనకు ముఖ్యమైన కొవ్వు తగ్గటానికి ఇది ఎక్కువగా పనిచేస్తుందట. రాత్రి పడుకునే ముందు రెండు లవంగాలు తింటే చాలండి. భోజనం తర్వాతే తింటే మౌత్ ఫ్రషర్ కింద కూడా పనిచేస్తుంది.
మీరింకా ఒక అడుగు ముందుకేసి నాజుగ్గా తయారవ్వాలనుంటే..కాకరకాయ జ్యూస్ కూడా పరగడుపున ఒక షాట్ వేయండి. ఏంటీ కాకరకాయ జ్యూసా అసలు తగగలమా అనుకుంటున్నారా.. అనుకున్నంత ఘోరంగా ఉండవ్వండి. ఏం చక్కా జ్యూస్ చేసుకుని అందులో నిమ్మకాయ చుక్కలు, కొంచె తేనె వేసుకోని లాగించేయండి. వారంలోనే చెడు కొలెస్ట్రాల్ తగ్గటం మొదలవుతుంది. డయబెటీస్ తగ్గించటానికి ఈ జ్యూస్ చాలా బాగా పనిచేస్తుందట. అయితే మీకు ఇది తీసుకున్న ప్రారంభదశలో ఏమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తే తీసుకోకపోవటం మంచిది.
కాకరకాయ జూస్ కష్టమైతే..వేడినీళ్లలో అల్లం, వెల్లుల్లి, నిమ్మకాయ రసం, యాపిల్ సైడర్ వెనిగర్ వేసుకుని తాగండి. ఇది కూడా కొవ్వు తగ్గటంలో బాగా పనిచేస్తుంది. బీపీ తగ్గటంలోనూ ఇది ఉపయోగపడుతుంది.
ఇవి పాటిస్తే చాలు.. పొట్ట పెరగదు, బరువు తగ్గంటలోను ఉపయోగపడతాయి. ఇక బ్యాక్ పెయిన్ కు మాత్రం వెన్నుముక నిటారుగా పెట్టి కుర్చోడానికి ప్రయత్నించండి. 90% బ్యాక్ పెయిన్స్ కారణం వర్క్ చేసేప్పుడు కుర్చునే పొసిషన్ సరిగ్గా లేకపోవటమే. కాబట్టి మంచిగా ఏర్పాటు చేసుకోండి.
వర్క్ ఫ్రం హోమ్ బాగానే ఉంటుందండి.. 80% శాతం మంది ప్రజలు వర్క్ ఫ్రం హోమ్ ను ఎంజాయి చేస్తున్నారు. కానీ ఇలాంటి సమస్యల వల్లే కాస్త చింతిస్తున్నారు. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు..కొంచెం ఇష్టం కొంచెం కష్టంగా సాగిపోతున్న వర్క్ ఫ్రం హోమ్ సాఫీగా సాగిపోతుంది. అసలే మూడో దశ కరోనా వస్తుందని నిపుణులు అంటున్నారు. ఒకవేళ అది ఉద్ధృత స్థాయిలో విజృంభిస్తే ఇంకా మీరు ఇంటి నుంచే పనిచేయ తప్పదు. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోంది. ఏ కొత్త పని చేసినా కనీసం 14-21 రోజులు చేయాలి. అప్పుడే దాని ఎఫెక్ట్ బాగా కనిపిస్తుంది. మొదలుపెట్టిన రెండో రోజే..ఏం రిజల్ట్ లేదు, వేస్ట్ అని మానేయకూడదు. మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుంటే..టిప్స్ అన్నింటిని కనీసం 21రోజులు ఫాలో అవటానికి ట్రై చేయండి.