సెప్టెంబర్ 17.. టీఆర్ఎస్ ను ఇరుకున పెడుతున్న ప్రతిపక్షాల మీటింగులు

-

సెప్టెంబర్ 17.. తెలంగాణ విమోచన/ విలీన దినం. నిజాం పాలనకు చరమగీతం పాడిన దినం. నిరంకుశ ప్రభుత్వానికి ఆఖరి దినం. భారతదేశంలో తెలంగాణ విలీనం అయిన దినం. ఐతే ప్రస్తుతం ఈ దినంపై అనేక చర్చలు నడుస్తున్నాయి. అటు తెలంగాణ ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీలు విమోచన దినంపై కొత్త చర్చను తీసుకువస్తున్నాయి. విమోచన దినాన్ని అధికారికంగా టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు ఉద్యమ సమయంలో అన్న మాటలను బీజేపీ గుర్తు చేస్తుంది.

అలాగే ఇటు కాంగ్రెస్ దళిత- గిరిజన దండోరా సభ నిర్వహిస్తుంది. సిద్ధిపేట జిల్లాలో ఈ సభ ఈరోజు జరగనుంది. అలాగే బీజేపీ ఆధ్వర్యంలో నిర్మల్ వేదికగా సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి అమిత్ షా హాజరు కావడం గమనార్హం. నిర్మల్ లోని వెయ్యి ఊడల మర్రి వేదికగా ఈ బహిరంగ సభ జరగనుంది. మరి ఈ రెండు మీటింగుల నేపథ్యంలో టీఆర్ఎస్ ఎలాంటి స్పందన తెలియజేస్తుందని ఆసక్తిగా మారింది. చూడాలి ఏం జరగనుందో!

Read more RELATED
Recommended to you

Exit mobile version