భ‌లే.. మేకల బ్యాంక్‌.. ఒక మేకను లోన్‌ తీసుకుని 4 మేక పిల్లలను ఇస్తే చాలు..!

-

బ్యాంక్‌ అంటే మనకు ముందుగా డబ్బు డిపాజిట్‌ చేయడం, లోన్లు తీసుకోవడం గుర్తుకు వస్తాయి. తీసుకున్న లోన్లను మనం ఈఎంఐల రూపంలో చెల్లిస్తాం. అయితే మహారాష్ట్రలో ఓ వెరైటీ బ్యాంక్‌ ఉంది. అదే మేకల బ్యాంక్‌. అందులో ఎవరైనా ఒక మేకను లోన్‌గా తీసుకోవచ్చు. కానీ 40 నెలల్లో 4 మేక పిల్లలను ఇచ్చి లోన్‌ చెల్లించాల్సి ఉంటుంది.

మహారాష్ట్రలోని అకోలాలో ఉన్న సంఘవి మొహాలి గ్రామంలో 52 ఏళ్ల నరేష్‌ దేష్‌ ముఖ్‌ అనే వ్యక్తి గోట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కార్ఖేడాను నిర్వహిస్తున్నాడు. 2018, జూలై 4వ తేదీన అతను ఈ బ్యాంక్‌ను ఓపెన్‌ చేశాడు. ఇప్పుడు ఈ బ్యాంకులో 1200 మందికి పైగ డిపాజిటర్లు ఉన్నారు. అంటే వారందరూ మేకలను రుణంగా తీసుకున్నవారే. సాధారణంగా ఒక్క మేకను తీసుకుంటే అది 40 నెలల్లో దాదాపుగా 30 పిల్లలకు జన్మనిస్తుంది. కానీ బ్యాంక్‌కు మాత్రం కేవలం 4 మేక పిల్లలను ఇస్తే చాలు. అందువల్లే చాలా మంది మేకలను లోన్లుగా తీసుకుని మేకల వ్యాపారం చేయడం ప్రారంభించారు. దీని వల్ల ఎంతో మంది స్వయం ఉపాధి పొందుతున్నారు. రూ.లక్షల ఆదాయం ఆర్జిస్తున్నారు.

ఇక వ్యాపారానికి తనకు రూ.40 లక్షలు అయిందని మొదట 340 మేకలను కొన్నానని నరేష్‌ తెలిపారు. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో మహారాష్ట్ర వ్యాప్తంగా 100 మేకల బ్యాంకులను తెరవాలనేదే తాను లక్ష్యంగా పెట్టుకున్నానని వివరించాడు. ఏది ఏమైనా ఈ ఐడియా ఏదో బాగానే ఉంది కదా..!

Read more RELATED
Recommended to you

Exit mobile version