పోలీసులకి ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయడం మీద అవగాహన లేదట !

-

ఏపీ సిఎం చైర్మన్ గా ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ విజిలెన్స్ మానిటరింగ్ సెల్ సమావేశం ముగిసింది. అనంతరం ఏపీ హోం మంత్రి సుచరిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల సత్వర  పరిష్కారానికి అవసరమైన మేరకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం చేపదుతున్నామని ఆమె పేర్కొన్నారు. దిశా పోలీస్ స్టేషన్ల కోసం ఏర్పాటు చేయనున్న ఫోరెన్సిక్ ల్యాబులను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తు కోసం వినియోగించుకోనున్నామని ఆమె అన్నారు.

ఎస్సీలపైనే అట్రాసిటీ కేసులు నమోదు చేయడం వంటి ఘటనలు అవగాహన లేకపోవడం వల్ల జరిగి ఉండొచ్చని అంటూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని గ్రామంలో ఈ తరహా కేసులు అవగాహన లేకపోవడం వల్లే జరిగిందని ఆమె అన్నారు. కానిస్టేబుల్ స్థాయి వరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగాహన కల్పిస్తామని ఆమె పేర్కొన్నారు. రాజధాని గ్రామాల్లోని ఎస్సీ రైతులకు సంకెళ్ల వేసిన విషయం ఈ సమావేశంలో చర్చకు రాలేదని ఆమె అన్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version