స్ఫూర్తి: కేవలం ఒక్క రూపాయి తీసుకుని వైద్యం అందిస్తున్న డాక్టర్.. అవసరమైతే తానే ఖర్చుపెడుతూ..!

-

ఈ రోజుల్లో మంచి చేసే వాళ్లే తగ్గిపోయారు. ఎంతసేపు నా సంపాదన.. నా జీవితం అని బ్రతికే వాళ్ళే ఎక్కువ మంది ఉంటున్నారు. ఒకరి కోసం ఆలోచించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. కానీ నిజానికి ఎదుటి వాళ్ళకి సహాయం చేయడంలో సంతోషంగా ఉంటుంది. అందరూ కూడా ధనవంతులు కాలేరు. డాక్టర్ శంకర్ రామచందన్ చిన్నప్పుడు తన తండ్రి ఎంతగా కష్టపడ్డారో చూశారు.

DR Shankar Ramchandani

32 మంది ఉన్న ఇంట్లో అతను స్టేషనరీ షాప్ ని నడుపుతూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. డాక్టర్ శంకర్ తాత గారు మరియు మేనమామ చనిపోవడంతో కుటుంబ పెద్దగా డాక్టర్ శంకర్ తండ్రి వ్యవహరించారు. అంతమంది ఉండే ఇంటిని నడపడం కాస్త కష్టమే. అయితే అనారోగ్య సమస్య వచ్చిందంటే సరైన వైద్యం ఉండేదికాదు. అలానే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా ఉండేవి కాదు.

చిన్ననాటి నుండి ఎన్నో ఇబ్బందులని ఆయన చూసారు. కానీ డాక్టర్ శంకర్ ఇప్పుడు ఎంతోమంది పేద వాళ్ళకి అండగా నిలబడ్డారు. తన తండ్రి అతన్ని డాక్టర్ చేయాలని అనుకున్నారు. అయితే కేవలం తండ్రి కలను నిజం చేయడానికి మాత్రమే కాకుండా పేద వాళ్ళకి అండగా నిలబడాలని డాక్టర్ అయ్యానని ఆయన చెప్పారు. డాక్టర్ శంకర్ గారి తండ్రికి ఐదుగురు కొడుకులు, నలుగురు కుమార్తెలు. 2001లో తన తండ్రి చనిపోయారు.

దీంతో అతని పెద్ద అన్న కుటుంబ బాధ్యత తీసుకోవలసి వచ్చింది. మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్ లో డాక్టర్ శంకర్ ఒడిస్సా రాష్ట్రంలో రెండవ ర్యాంకు తెచ్చుకున్నారు. అయితే కేవలం ఒక్క రూపాయి తో ప్రస్తుతం వైద్యం అందిస్తున్నారు. పేద వాళ్లకి ట్రీట్మెంట్ కోసం డబ్బులు ఉండవని అందుకోసం కేవలం ఒక్క రూపాయికే వైద్యం అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఏడు వేల మందికి పైగా రోగులకు ఒక్క రూపాయి తో వైద్యం చేశారు.

రోజుకి ఆయన 20 నుండి 30 మందికి వైద్యం చేస్తారు. అది కూడా కేవలం ఒక్క రూపాయి తోనే వైద్యం చేస్తారు. మందులు కూడా ఇస్తారు. ఒక వేళ ఖర్చు ఎక్కువ అయితే ఆయన డబ్బులని స్వయంగా పెట్టుకుంటారు. ప్రతి రోజు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు ఒక్క రూపాయి తో క్లినిక్ లో వైద్యాన్ని అందిస్తారు.

ఆయనకు ప్రభుత్వ ఉద్యోగం ఉండడంతో ప్రతిరోజు ఉదయం 9 నుండి 5:00 వరకు అక్కడ పని చేస్తారు. ఆ తర్వాత 6 నుండి 7 వరకు పేదలకు ఒక్క రూపాయి తో వైద్యం అందిస్తారు. కొన్ని కొన్ని సార్లు రాత్రి 11 వరకు కూడా ఆయన వైద్యం చేస్తారు. అయితే పేదలకు తన సొంత డబ్బులు ఖర్చు పెట్టడం ఆనందంగా ఉందని.. వాళ్లకి ఇలా ట్రీట్మెంట్ చేస్తే సంతృప్తిగా ఉంటుందని ఆయన చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version