అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నేపథ్యంలో ఈ నెల 30వ తేదీన జరుగాల్సిన తెలంగాణ కేబినెట్ భేటీ
ని వాయిదా వేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సంతాప దినాల్లో భాగంగా ఆయనకు నివాళులర్పించేందుకు సోమవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో ఆ రోజు తలపెట్టిన తెలంగాణ కేబినెట్ భేటీని వాయిదా వేసినట్లుగా ప్రభుత్వం పేర్కొంది.
తదుపరి మళ్లీ కేబినెట్ భేటీ ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపై ప్రభుత్వం ప్రస్తుతానికి ఎలాంటి
సమాచారం వెల్లడించలేదు. రైతు భరోసా, రేషన్ కార్డుల విధివిధానాల పై, భూమి లేని
నిరుపేదలకు నగదు బదిలీపై, యాదగిరిగుట్ట ఆలయ బోర్డుపైన, కుల గణన, స్థానిక సంస్థల
ఎన్నికలు వంటి కీలక అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని
భావించారు. దీంతో ఈ దఫా జరుగబోయే కేబినెట్ భేటీపై ఆయా వర్గాల్లో ఆసక్తి నెలకొంది.