ఆచార చాణక్య లైఫ్ లో వచ్చిన సమస్యల గురించి ఎంతో చక్కగా చెప్పారు ఆచార్య చాణక్య చెప్పినట్లు చేస్తే జీవితంలో పైకి రావడానికి అవుతుంది. సమస్యలన్నిటికీ కూడా దూరంగా ఉండొచ్చు. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకి కూడా సొల్యూషన్ ని చాణక్య ఇచ్చారు ప్రతి ఒకరు కూడా ఆనందంగా ఉండాలన్నా కష్టాలు లేకుండా ఉండాలన్నా మనసుని అదుపు లో ఉంచుకోవాలని ఆచార్య చాణక్య చాణక్య నీతి ద్వారా చెప్పారు. ఒక వ్యక్తి తన యొక్క మనసును అదుపులో ఉంచుకుంటే ఎంతో సంతోషంగా సంతృప్తిగా జీవించగలరు అని అన్నారు చాణక్య.
అదే ఒకవేళ మనసుని అదుపులో ఉంచుకోక పోతే సంతోషంగా సంతృప్తికరంగా ఉండలేరు. ప్రపంచంలోనే అన్ని సౌకర్యాలు సదుపాయాలు వున్నా చంచలమైన మనసు వ్యక్తిని ఇబ్బంది పెడుతుంది అని చాణక్య అన్నారు. మనసుని అదుపులో ఉంచుకోలేని వ్యక్తి ఏ పని ప్రారంభించినా కూడా విజయాన్ని అందుకోలేరు. మనసుని అదుపులో ఉంచుకునే శక్తి లేని వ్యక్తులు ఎంత పెద్ద కుటుంబంలో ఉన్న ఒంటరిగా ఉన్నా కూడా సంతోషంగా ఉండలేరని చాణక్య చెప్పారు ఎప్పుడూ కూడా అలాంటి వ్యక్తులు అసంతృప్తిగానే ఉంటారని ఆనందంగా ఉండలేనని చాణక్య చెప్పారు.
మనసుపై నియంత్రణ కోల్పోయిన వ్యక్తికి ప్రజల సాంగత్యం బాధ ని కలిగిస్తుంది. ఎందుకంటే అటువంటి వ్యక్తి ప్రజల విజయాన్ని చూసి అసూయపడతాడు ఎప్పుడూ సంతోషంగా ఉండలేడు. ఇటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా ప్రారంభించిన పనులను పూర్తి చేయలేక లక్ష్యాన్ని చేరుకోలేక ఓటమిపాలవుతూ ఉంటారు. కాబట్టి మనసుని అదుపులో ఉంచుకోవడం అనుకున్నది సాధించడం అవసరం.