రియల్ స్టోరీ: ఆ యువకుడు చేసిన ఒక్కపని తనను రతన్ టాటకు అసిస్టెంట్ గా చేసిందట

-

కొన్నిసార్లు మనం చేసే చిన్నచిన్న పనులే మనకి ఎక్కువ గుర్తింపు తీసుకొస్తాయి. అలాగే ఒక్క ఐడియా చాలు జీవితం మారిపోవటానికి. అయితే బాగుపడుతుంది. లేదా ఇంకా దెబ్బతింటాం. అలానే ఓ యువకుడికి వచ్చిన ఆ ఐడియా తన జీవితాన్నే మార్చేసింది. రతన్ టాటాకి అసిస్టెంట్ అయ్యాడు. ఇంతకీ ఎవరా యువకుడు అనుకుంటున్నారా. శాంతను నాయుడు తన పేరు. సామాజిక స్పృహతో తను చేసిన పనేంటో..ఎలా తన జీవితం మారిందో ఇప్పుడు చూద్దాం.

శాంతను ఆ రోజు ఇంటికి వస్తున్నప్పుడు రోడ్డు మీద ఒక కుక్కకు ఆక్సిడెంట్ అవటంతో చనిపోయింది. శాంతనుకి ఆ సంఘటన ఎంతగానో కలిచివేసింది. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఏదైనా చేయాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు.

బాగా ఆలోచించి తన స్నేహితులతో కలిసి ఒక కుక్క బెల్ట్ ను రూపొందించాడు. బెల్టు మొత్తం ఒకే రంగులో కాకుండా వివిధ రంగులు కలిపి రేడియంతో తయారు చేశాడు. దాంతో అన్ని రంగులు ఉన్న బెల్ట్ ను వేసుకున్న కుక్క రోడ్డుమీదకి వెళ్తే ఎదురుకుండా ఏమైనా వాహనం ఉంటే ఆ బెల్టు మీదున్న రంగులు రిఫ్లెక్ట్ అయ్యి మనిషి వాహనాన్ని ఆపేస్తాడు.రాత్రివేళల్లో రేడియం ఉండటంతో చీకట్లో కూడా ఆ బెల్ట్ వెలుగుతుంది. దాంతో ఎలాంటి ప్రమాదం జరగదు.

మొదట శాంతను ఒక కుక్క కోసమే బెల్ట్ తయారుచేశాట. కానీ ఆ తర్వాత స్థానికులు దాన్ని చూసి తమకు కూడా అలాంటి బెల్ట్ కావాలి అని అడిగారు. శాంతనుకి దీన్ని వ్యాపారంగా మార్చాలని ఆలోచన వచ్చింది. కానీ శాంతను దగ్గర అన్ని బెల్టులు తయారు చేసే అంత డబ్బులు లేవు. ఇదంతా చూస్తున్న శాంతను తండ్రి టాటా ఇండస్ట్రీస్ కి ప్రాజెక్ట్ ఫండింగ్ చేయడానికి ఉత్తరం రాయమన్నాడు. కానీ శాంతనుకి టాటా వాళ్లు తిరిగి జవాబు ఇస్తారన్న నమ్మకంలేదు.ఏదో తండ్రి చెప్పాడుకదా అని రాశాడు.

రెండు నెలల వరకు టాటా ఇండస్ట్రీ నుండి ఎలాంటి రెస్ప్రాన్స్ లేదు. వాళ్ళు సమాధానం ఇవ్వరు అని అనుకుంటున్న సమయంలో రెండు నెలల తర్వాత శాంతనుకి టాటా ఇండస్ట్రీస్ నుండి కాల్ వచ్చింది. ముంబైకి రమ్మని పిలిచారు. రతన్ టాటాకి కూడా మూగజీవాల అంటే ఇష్టం ఉండటంతో ఇలాంటి ప్రాజెక్టు వల్ల ఎన్నో మూగజీవాలను ప్రమాదానికి గురి కాకుండా రక్షించవచ్చనే ఉద్దేశంతో ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అలా శాంతను మోటోపాస్ అన్న కంపెనీని ప్రారంభించాడు.

ఈ కంపెనీని స్నేహితులతో పాటు నడుపుతున్నాడు. ఒక పక్క కంపెనీ పని చేసుకుంటూనే మరో పక్క ఉన్నత చదువుల కోసం వేరే దేశానికి వెళ్ళాడు. చదువు ముగించుకుని తన స్వదేశానికి వచ్చిన కొన్ని నెలల తరువాత ఒక రోజు టాటా ఆఫీస్ నుండి కాల్ వచ్చింది. స్వయంగా రతన్ టాటానే తన పని ఎక్కడికక్కడ ఆగిపోయింది వచ్చి చేసి పెడతావా అని అడిగారట. దాంతో రతన్ టాటా దగ్గర 18 నెలలు పర్సనల్ అసిస్టెంట్ గా చేసే అవకాశాన్ని శాంతను పొందాడు.

అలా తన జీవితం మారిపోయింది. ఒకప్పుడు టాటావాళ్లు రిప్లైయ్ కూడా ఇవ్వరూ అనుకునే స్థాయినుండి రతన్ టాటా భుజంమీద చేయి వేసుకుని ఫొటో దిగే స్టేజ్ వరకూ శాంతును ఎదిగాడు. చేసే ప్రతిపనిలో ఫలితం రావాలి అనుకుని చేస్తే మనం ఏది చేయలేం. ఏదైతే అదిఅయ్యింది ఫస్ట్ మన ప్రయత్నం మనం చేద్దాం అనుకుని ముందుకెళ్లాలి. ఆపేవాళ్లు ఉండొచ్చు కానీ మనం అన్నిసార్లు పక్కన వాళ్లు సలహాలు పాటించటం మంచిదికాదు..ఏం చేయకుండానే లాభనష్టాల గురించి ఆలోచించటం కరెక్ట్ కాదామో కదా..అలా అని ఏదిపడితే అది ఆలోచన లేకుండా చేయమనికాదు..కొన్నిసార్లు మనం బాగా ప్లాన్ చేసుకుని చేసేద్దాం అనుకున్నవే..ఎ‌వరో చెప్పారని, ఏం వస్తుందిలే ఇలా చేస్తే అని గివ్ అప్ చేస్తాం..అలా కాకుండా ఇంతదూరం వచ్చాంకదా చేసేద్దాం అనుకుని ముందుకెళినప్పుడు జీవితం యొక్క అసలైనా మజా దొరుకుతుంది.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version