జిల్లాల పంచాయతీ అధికారులతో మంత్రి సీతక్క భేటీ..

-

రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన పంచాయతీ అధికారులతో గిరిజన, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. ఆదివారం హైదరాబాద్‌ ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్, డైరెక్టర్ శ్రీజన, డీపీవోలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లాల్లోని వివిధ గ్రామాల్లో నిధుల వినియోగం, పారిశుద్ధ్య నిర్వహణ, మంచినీటి సరఫరా, పనుల పురోగతి, పచ్చదనం తదితర అంశాలపై మంత్రి సీతక్క సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. అంతకుముందు డీపీవో అసోసియేషన్ సభ్యులు మంత్రి సీతక్కను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version