అవకాశం ఇవ్వడమే సాయం అని చెబుతుంటారు. కానీ రెండింటికీ చాలా తేడా ఉంది. సాయం చేసేవాడు దాన్నుండి ప్రతిఫలంగా ఏదీ ఆశించడు. కానీ అవకాశం ఇచ్చేవారు ప్రతిఫలంగా దాన్నుండి ఎంతో కొంత ఆశిస్తారు. అది తప్పేమీ కాదు. ఒకానొక అడవిలో దూరంగా ఉన్న కొండ మీద బంగారు నిధి ఉందని తెలిసి అది తవ్వడానికి ఒక్కరికే సరిపోమని, మరో ఇద్దరికీ అవకాశం ఇచ్చి, తనతోపాటు తీసుకెళ్తే, వారికి కూడా ఎంతో కొంత నిధిలో నుండి వాటా ఇవ్వాల్సి ఉంటుంది. అవకాశం ఇవ్వడం అంటే ఇదే. అదే సాయం చేయడం మాత్రం వేరుగా ఉంటుంది.
సాయంత్రం పూట రోడ్దు మీద అటూ ఇటూ తిరుగుతూ ఉన్న వ్యక్తి, ఆకలి తట్టుకోక రోడ్డు మీద అలాగే పడిపోతే అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్ళడం సాయం చేయడం. రెండింటికీ చాలా తేడా ఉందని అర్థం చేసుకోవాలి. మన జీవితంలో ఏదైనా సాధించడానికి సాయం చేయాల్సిన వాళ్ళు లేకపోయినా ఫర్వాలేదు గానీ అవకాశం ఇచ్చేవాళ్ళు మాత్రం ఉండాలి. ఎందుకంటే ఒక పనిని తమకు తాముగా చేసుకోలేరు. అది ఏదైనా సరే. చిన్నప్పుడు నాన్న వేలు పట్టుకుని నడవడం దగ్గర నుండి, పాఠశాలల్లో పాఠం నేర్చుకోవడం, పెళ్ళి, పిల్లలు, ఇలా ప్రతీ దానికి ఎవరో ఒకరు అవసరం అవుతూనే ఉంటారు.
ఒక్కోసారి అవకాశాలే కనిపించవు. అలాంటప్పుడు మీ కళ్ళజోడుకి మసి అంటుకుందేమో అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే, అవకాశం రాలేదంటూ బాధపడితే ఎలాంటి ప్రయోజం ఉండదు. మనకు మనమే అవకాశాన్ని సృష్టించుకోవాలి. ఈ ప్రపంచంలో కనిపెట్టబడ్డ చాలా వస్తువులు మొదట్లో పెద్దగా
అవసరం లేనివే.
అవి సృష్టించిన తర్వాతే వాటి అవసరాలు మనుషులకి గుర్తుకు వచ్చాయి. అందుకే నీకు నచ్చిన పని చేసుకుంటూ పోతే గెలుపు నీ వెనకే వస్తుంది. వాళ్ళే నీకు ప్రేరణగా నిలవాలి. నీ దారిలో నువ్వు వెళ్తున్నప్పుడు ఓడిపోయే అవకాశం ఉన్నమాట నిజమే. కానీ అవకాశం వస్తేనే కదా నువ్వు ఓడిపోతున్నావని నీకు తెలిసేది. అంటే ఓడిపోవడానికి కూడా అవకాశం కావాలి. కాబట్టి దానికున్న ఇంపార్టెన్స్ అంతా ఇంతా కాదు.