79 ఏళ్ల వయస్సులో సొంతంగా బిజినెస్..లక్షల్లో ఆదాయం..సక్సెస్ స్టోరి..

-

తిని కూర్చుంటే కొండలు అయిన ఇట్టే కరిగి పోతాయి..అందుకే కష్టపడి చేసే పని వల్ల వచ్చే ఆదాయం, ఆనందం జీవితాంతం ఉండి పోతుంది.. కష్టాలను ఎదుర్కొని జీవితంలో సక్సెస్ ను అందుకున్న వారేందరో ఉన్నారు.. అందులో కొందరు వయస్సు తో సంభందం లేకుండా బిజినెస్ చేస్తూ సక్సెస్ ను అందుకున్నారు. అందులో ఒకరు కోకిలా పరేఖ్..ఈమె సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ముంబైకి చెందిన కోకిలా పరేఖ్ 79వ ఏట టీ మసాలా వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇంట్లో కోకిలా తయారు చేసే రుచికరమైన టీని ప్రశంసిస్తూ స్నేహితులు, బంధువులు ప్రోత్సహించారు.ఈ మసాలా టీ రెసిపీ కోకిలకు ఆమె తల్లి నుంచి వారసత్వంగా అందించారు. 2020లో.. లాక్‌డౌన్ సమయంలో తన ఫ్యామిలీ రెసిపీతో వ్యాపారంలోకి అడుగు పెట్టాలని అనుకున్నారు. తల్లి ఆలోచనకు కుటుంబ సభ్యులు అండగా నిలిచారు. కోకిల కుమారుడు తుషార్ టి మాసాల తయారీకి కావాల్సిన సుగంధ ద్రవ్యాల కొనుగోలు చేయడానికి సహాయం చేశాడు. వ్యాపారానికి KT (కోకిల తుషార్) చాయ్ మసాలా అని పేరు పెట్టారు.

KT చాయ్ మసాలా.. తాజా సుగంధ ద్రవ్యాలతో తయారు చేయబడింది. ఈ మసాలాలో కృత్రిమ రంగులు లేదా కృతిమ రుచి లేదు. అంతేకాదు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఈ KT చాయ్ మసాలా టీ పొడిని భారతదేశం అంతటా సరఫరా చేస్తారు. వినియోగదారుల నుంచి ఆర్డర్‌ రవాణా చేస్తారు..ఈ టీ రోజుకు 500 వందలకు పైగా ఆర్డర్ లను అందుకుంటుంది.

తాను మహిళలు గృహిణులుగా మాత్రమే జీవించాలనే ఆలోచనతో తాను పెరిగానని చెప్పారు. తనకు 21 సంవత్సరాల వయస్సులో పెళ్లి అయింది.. అప్పటి నుంచి కుటుంబ సభ్యుల గురించి ఆలోచించడం.. వారి గురించి ఆలోచించడంతోనే తన 60 సంవత్సరాలు సరిపోయాయి.. ఇప్పుడు తనకు నచ్చినట్లు జీవిస్తుందని చెప్పింది.ఆ టీకి మంచి డిమాండ్ ఉండటంతో లక్షల్లో ఆదాయాన్ని అందుకుంటుంది..ప్రస్తుతం కోకిల కు 80 ఏళ్ళు.. ఆమె కృషి,పట్టుదలతో అందరి చేత ప్రశంసలు అందుకుంటుంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version