Success Story : కాలుష్యాన్ని అరికడుతూ కోట్లు సంపాదిస్తున్న హైదరాబాద్ కుర్రాడు!

-

హైదరాబాద్‌ మహా నగరానికి చెందిన ఓ స్టూడెంట్ ప్లాస్టిక్ క్యారీబ్యాగ్స్ వల్ల వస్తున్న కాలుష్యాన్ని అరికట్టాలని డిసైడ్ అయ్యాడు. దీంతో ఆ కుర్రాడు 2022 వ సంవత్సరంలో Bioreform పేరుతో ఒక స్టార్ట్ అప్ కంపెనీని స్టార్ట్ చేసి ప్రస్తుతం కోట్లలో వ్యాపారం చేస్తూ సూపర్ సక్సెస్ అయ్యి యూత్ కి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

హైదరాబాద్కి చెందిన ఆ కుర్రాడి పేరు మహ్మద్ అజర్ మొయిదీన్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల జరుగుతున్న కాలుష్యాన్ని పరిష్కరించేందుకు మహ్మద్ ప్లాస్టిక్ బ్యాగ్‌లకు బదులుగా బయోడిగ్రేడబుల్, కంపోస్టబుల్ మెటీరియల్‌తో పర్యావరణ అనుకూలమైన ఉత్పత్తులతో ముందుకు వచ్చి అందరి మెప్పు పొందుతున్నాడు. ఈ వ్యాపారానికి ముందు 14 ఏళ్ల వయస్సులో ఇన్సూరెన్స్ పాలసీలు అమ్ముతూ తన కెరీర్ స్టార్ట్ చేశాడు మహ్మద్ అజర్ మొయిదీన్. ఇక ఆ తర్వాతా లోగో డిజైన్, వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ ఇంకా అలాగే క్లీనింగ్ సర్వీసెస్ వంటి వ్యాపారాలను కూడా స్టార్ట్ చేశాడు ఈ కుర్రాడు. అయితే కరోనా వైరస్ రాక అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసి మలుపు తిప్పింది.

2019 వ సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ప్రసంగంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిర్మూలించాలని పిలుపునిచ్చినప్పుడు ప్రజలకు పర్యావరణానికి అనుకూలమైన ఫీచర్లతో కూడిన ప్రోడక్ట్ ని తయారు చేయాలని ఈ కుర్రాడు డిసైడ్ అయ్యాడట.బయోపాలిమర్‌లను వాడి వాటి ద్వారా బయోటెక్నాలజీ ద్వారా విప్లవాత్మక ఉత్పత్తిని రూపొందించే దిశగా మహ్మద్ అడుగులు వేశాడు. ఉత్పత్తి వ్యయం అనేది అడ్డంకి అయినప్పటికీ.. మంచి ధరలకు ఈ ప్యాక్‌లను తయారు చేయడానికి గాను బయోర్‌ఫార్మ్ మార్గదర్శకత్వం వహించింది. ప్లాస్టిక్ కిలో రూ.130కి అమ్ముతుండగా, బయోరిఫార్మ్ బ్యాగులని కిలో రూ.190కి అందుబాటులోకి తీసుకొచ్చాడు ఈ కుర్రాడు.

అయితే మహ్మద్ స్టార్ట్ చేసిన ఈ వ్యాపారం మెుదటి నుంచి మంచి ఆదరణను అందుకుంది.ఇప్పుడు Bioreform ప్యాక్ అమ్మకాలు ఏకంగా 8 నగరాలకు విస్తరించాయి. 2022-23 మొదటి సంవత్సరంలో వార్షిక ఆదాయం మొత్తం రూ.16 లక్షలు ఉండగా.. ఆ తర్వాత సంవత్సరం ఈ ఆదాయం రూ.1.3 కోట్లకు పెరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. ఇక 2024-25లో రూ.3 నుంచి రూ.3.5 కోట్ల ఆదాయాన్ని సాధించాలని ప్లాన్ చేస్తున్నట్లు మహ్మద్ తెలిపారు. ప్రస్తుతం ఈ కంపెనీలో 11 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మున్ముందు తన కంపెనీ ద్వారా పర్యావరణ పరిరక్షణలో భారత దేశాన్ని అగ్రగామి దేశంగా నిలపాలని మహ్మద్ అజహర్ భావిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version