ముసలి నక్కకు బడ్జెట్ నచ్చలేదు…కేసీఆర్ పై షాద్ నగర్ ఎమ్మెల్యే ఫైర్

-

రాజకీయంగా, ఆర్థికంగా, నీళ్ల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ని ఆగం పట్టించింది అని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.నిన్న అసెంబ్లీ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆమోదయోగ్యంగా ఉంది అని తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అని తెలిపారు. కానీ ఈ బడ్జెట్ ని గ్యాస్, ట్రాష్ అని కేసీఆర్ విమర్శిస్తున్నాడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

లక్ష్మీదేవి రిజర్వాయిర్ పూర్తి చేస్తామని కేసీఆర్ 10 సభల్లో చెప్పాడు అని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పచ్చి అబద్ధాలు ఆడే ప్రభుత్వం అని తేలిపోయింది అని అన్నారు.కేసీఆర్ కాళేశ్వరాన్ని కాల గర్భంలో కలిపేశాడు అని.. ముసలి నక్కకు తెలంగాణ బడ్జెట్ నచ్చలేదు అని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మండిపడ్డారు. కాగా, నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ బడ్జెట్ పై కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ప్రభుత్వాన్ని బడ్జెట్ విషయంలో చీల్చి చెండడుతాం అని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version