రికార్డ్: హిమాలయాల్లో 2400 మీటర్ల ఎత్తులో ఉన్న నాగుపాము…!

-

ఉత్తరాఖండ్ లో అరుదైన నాగు పాముని అధికారులు గుర్తించారు. అత్యంత ఎత్తైన పర్వతాలలో ఉన్న నాగు పాముని కనుగొన్నారు. 2200 నుంచి 2,400 మీటర్ల యొక్క ఎత్తులో ఉన్న నాగు పాముని గుర్తించి ఫోటోలను విడుదల చేసారు. సాధారణంగా నాగు పాముల రక్తం చల్లగా ఉంటుంది కాబట్టి అవి వెచ్చని వాతావరణంలో ఉండటానికి ఇష్టపడుతాయి. కాని ఈ పాము అంత ఎత్తైన చలిలో ఉంది.

హల్ద్వానీలోని ఉత్తరాఖండ్ అటవీ శాఖ పరిశోధనా విభాగం తయారుచేసిన ఒక నివేదికలో ఈ విషయం చెప్పారు. టెరాయ్ ప్రాంతంలో హిమాలయాల ఎత్తు 400 మీ నుండి 2,400 మీటర్ల వరకు ఉంటుంది. అలాంటి ప్రాంతంలో ఈ పాము ఉండటం విస్మయపరిచింది. ప్రపంచంలోని అతిపెద్ద విషపూరిత పాము అటువంటి ఎత్తులో ఎలా పెరుగుతుందో అని అధికారులు పరిశోధనలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version