తేలు కుడితే.. కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతాయి. మొదట తేలు కుట్టినప్పుడు ఆ నొప్పి మాత్రం వర్ణణాతీతంగా ఉంటుంది. సలసల జలతరిస్తుంది. కానీ తేలు విషానికి మార్కెట్‌లో ఎంత డిమాండ్ ఉందో తెలుసా..? లీటర్ తేలు విషం 82 కోట్లు పలుకుతుందట.. వామ్మో అంత కాస్టా..? అసలు ఈ తేలు విషంతో ఏం చేసుకుంటార్రా బాబు.. అన్ని కోట్లు ఎందుకు..? పిల్లులు, కుక్కలన్ని పెంచుకునే బదులు తేల్లు పెంచుకుంటే బాగుంటుందేమో కదా..?
కోళ్లు పెంచినట్లుగానే తేళ్లను పెంచుతున్నారంటే దాని వెనుక ఎంత సీక్రెట్ దాగివుందో అర్ధం చేసుకోండి. తేలు విషానికి మార్కెట్‌లో భారీగా డిమాండ్ ఉండటం వల్లే ఈతరహాలో తేళ్ల పెంపకం పరిశ్రమలు వెలసినట్లుగా తెలుస్తోంది. తేలు విషం లీటర్ 82కోట్లు ఉంటుంది. అందుకే తేళ్లను శ్రద్ధగా పెంచుకుంటున్నారు.
తేలు విషానికి ఇంత డిమాండ్ పెరగడానికి కారణం ఈ తేళ్ల విషాన్ని కాస్మోటిక్ ప్రొడక్ట్స్, కొన్ని రకాల మెడిసిన్స్ తయారిలో ఉపయోగిస్తున్నారట. అందుకే కుడుతుందేమోననే భయంతో చంపేసే తేళ్లను పెంచుకుంటున్నారు. లీటర్ తేలు విషం 80కోట్ల రూపాయలకుపైగా ఉండటంతో కొందరు తేళ్ల ఫారాలను ఏర్పాటు చేసి విషాన్ని సేకరిస్తున్నారు.
క్యాన్సర్ రోగం నయం చేయడానికి కూడా ఈ తేలు విషాన్ని ఉపయోగిస్తారట. అందుకే చాలా జాగ్రత్తలు తీసుకుంటూ తేళ్లను పెంచుతున్నారు. ఇక వాటి విషాన్ని ప్రత్యేక పద్దతుల్లో నిల్వ చేస్తున్నారు. కోట్ల రూపాయలు ధర పలుకుతున్న తేళ్ల విషం తయారు చేయడంలో కూడా అంతే రిస్క్ ఉంటుంది. ఉత్పత్తి అయిన విషాన్ని తేలు కొండిలోంచి ట్వీజర్స్‌తో పిండి బయటకు తీస్తున్నారు. అయితే ఇలా తేలు నుంచి విషాన్ని తీసే క్రమంలో దాని ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా ప్రత్యేక పద్దతిని అనుసరిస్తున్నారు.