నీళ్ళల్లో కూర్చుని 2 నిమిషాల్లో ఆరు రూబిక్స్ క్యూబ్ లను క్లియర్ చేసాడు…!

-

చెన్నైకి చెందిన ఒక యువకుడు 6 రూబిక్స్ క్యూబ్స్ ని నీటి అడుగున క్లియర్ చేయడం ద్వారా గిన్నిస్ రికార్డు సృష్టించాడు. అతని పేరు ఇల్లారాయం సేకర్… ఆరు రూబిక్స్ క్యూబ్స్‌ను నీటి అడుగున కూర్చుని క్లియర్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు. అతని వయసు 25 ఏళ్ళు. నీళ్ళ అడుగు నుంచి పైకి రాకుండా క్లియర్ చేసాడు. ఇందుకోసం గానూ సేకర్ రెండు నిమిషాల 17 సెకన్ల సమయం తీసుకున్నాడు.

పారదర్శకంగా ఉన్న నీళ్ళు ఉన్న కంటైనర్లో కూర్చున్నాడు. “యోగా ధ్యాన శ్వాస పద్ధతులను ఉపయోగించి, చెన్నైకి చెందిన ఇల్లారాయం సేకర్, నీటి అడుగున అత్యధిక రూబిక్స్ క్యూబ్స్ ని క్లియర్ చేసాడు అని, ఇది సరికొత్త రికార్డ్ అని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది. దీనికి సంబంధించి వీడియో కూడా పోస్ట్ చేసింది. అతని చుట్టూ పలువురు నిలబడి ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version