హమ్మింగ్‌ బర్డ్‌ టెక్నాలజీతో రానున్న విమానాలు.. వెనక్కి కూడా ఫ్లెయింగ్..!!

-

నేచర్‌ను ఎంజాయ్‌ చేసే వాళ్లు కొందరైతే.. వాటిని గమనించి డీప్‌గా స్టడీ చేసే వాళ్లు కొందరు ఉంటారు. ముఖ్యంగా శాస్త్రవేత్తలు ఇలానే చేస్తారు. ఎక్కడికి వెళ్లినా వాటి మీద బాగా రీసర్చ్‌ చేస్తారు.. పక్షులన్నీ గాల్లోనే ఎగురుతాయి.. కానీ హమ్మింగ్‌బర్డ్‌ మాత్రం అన్ని పక్షులలోకెల్లా సంథింగ్‌ డిఫ్రెంట్‌.. పక్షిల్లో చిన్నదైన హమ్మింగ్‌బర్డ్ ఎన్నో రకాలుగా శాస్త్రవేత్తల్ని ఆకట్టుకుంటోంది. మిగతా పక్షులకు లేని కొన్ని ప్రత్యేకతలు దీనికి ఉన్నాయి. ఇది గాలిలో ఉన్నచోటే స్థిరంగా ఉంటూ ఎగరగలదు. వెనక్కి కూడా ఎగరడం దీని ప్రత్యేకం.. ఇలా చేయడం ఇతర పక్షులకు వీలు కాదు. అవన్నీ ముందుకే ఎగరగలవు. పైగా గాలిలో స్థిరంగా ఉండటం వాటికి అస్సలు రాదు.
తనకున్న ప్రత్యేకతల వల్ల హమ్మింగ్ బర్డ్.. పూలలోని తేనెను ఎంతో తేలిగ్గా తాగగలుగుతోంది. పువ్వులపై వాలకుండానే గాలిలో స్థిరంగా ఎగురుతూ.. తన పొడవైన ముక్కుతో తేనెను తీసుకుంటోంది. ఈ పక్షిలోని ఈ ప్రత్యేకతలే శాస్త్రవేత్తల్ని ఆకర్షిస్తున్నాయి. భవిష్యత్తులో తయారుచేసే విమానాలు, హెలికాప్టర్లు ఇతర వాయు వాహనాలకు హమ్మింగ్ బర్డ్ టెక్నాలజీని ఆపాదించాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఎలా అంటే.. ప్రస్తుతం విమానాలు రన్‌వేపై దిగుతున్నాయి, రన్‌వే నుంచే ఎగురుతున్నాయి. కానీ అవి గాలిలో స్థిరంగా ఉండే ఛాన్స్ లేదు. వెనక్కి ఎగిరే పరిస్థితి కూడా లేదు. హెలికాప్టర్లు మాత్రం గాలిలో స్థిరంగా ఎగరగలుగుతున్నాయి.
నిజానికి ఇప్పటికే హమ్మింగ్ బర్డ్ టెక్నాలజీని వాడి డ్రోన్లను తయారుచేశారు. అవి కూడా గాలిలో స్థిరంగా ఉంటాయి. ఎటు కావాలంటే అటు వెళ్లగలవు. ఎందుకంటే వీటిని కింద నుంచి ఆపరేట్‌ చేస్తారు కాబట్టి.. భవిష్యత్తులో విమానాలతోపాటూ.. ఎగిరే రోబోలకు ఈ పక్షి టెక్నాలజీని ఆపాదించే శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు..
హమ్మింగ్ బర్డ్ రెక్కల్లో మస్క్యులోస్కెలిటల్ సిస్టం ఉంది. దీని వల్ల ఆ పక్షి ఎముకలు, కండరాలూ ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి. ఇదివరకు మిగతా పక్షుల ఆకారాన్ని బట్టీ విమానాల తయారీ జరిగింది. హమ్మింగ్ బర్డ్ చాలా చిన్నది కావడం వల్ల దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆ పక్షే కీలకం అవుతోంది.
హమ్మింగ్ బర్డ్ రెక్కల్లో మస్క్యులోస్కెలిటల్ సిస్టం ఉంది. దీని వల్ల ఆ పక్షి ఎముకలు, కండరాలూ ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి. ఇదివరకు మిగతా పక్షుల ఆకారాన్ని బట్టీ విమానాల తయారీ జరిగింది. హమ్మింగ్ బర్డ్ చాలా చిన్నది కావడం వల్ల దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆ పక్షే కీలకం అవుతోంది.
ఇప్పుడు శాస్త్రవేత్తలు హమ్మింగ్ బర్డ్ రెక్కలను ఎలా కదుపుతోంది? దాని కండరాలు ఎలా పనిచేస్తున్నాయి అనే విషయాల్ని మైక్రో సీటీ, ఎక్స్‌రే పద్ధతుల్లో తెలుసుకనే ప్రయత్నంలో ఉన్నారు.. అదే విధమైన టెక్నాలజీని విమానాలు, రోబోలకు కూడా సెట్ చెయ్యడం ద్వారా.. సరికొత్త విప్లవం తేవాలనుకుంటున్నారు
శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాల్లో సక్సెస్ అయితే.. భవిష్యత్ పూర్తిగా మారిపోతుంది. రెస్క్యూ ఆపరేషన్ల సమయంలో.. హెలికాప్టర్ల లాగానే.. విమానాలు కూడా గాలిలోనే స్థిరంగా ఉంటే… పెద్ద సంఖ్యలో బాధితుల్ని రక్షించే వీలుంటుంది.. అంతే కాదు రోబోలు, కార్లు కూడా గాల్లో ఎగురుతూ.. ఎలా కావాలంటే ఎలా తిరగగలవు. ఇమాజిన్‌ ఈ టెక్నాలజీ వస్తే ఎలా ఉంటుందో..!

Read more RELATED
Recommended to you

Exit mobile version