ఆన్ లైన్ సేల్స్ లో రికార్డు సృష్టించిన అలీబాబా

-

అలీబాబా… ఆన్ లైన్ షాపింగ్ చేసేవాళ్లకు ఈ పేరు సుపరిచితమే. మన దగ్గర ఫ్లిప్ కార్ట్, అమేజాన్ ఎంత ఫేమస్సో… చైనాలో అలీబాబా అంత ఫేమస్. చైనాలో ఎక్కువ శాతం ప్రజలు అలీబాబా ఈకామర్స్ సైట్ లోనే ఎక్కువగా ఆన్ లైన్ షాపింగ్ చేస్తుంటారు. మామూలుగా మనదగ్గర బిగ్ బిలియన్ డేస్ పెట్టినట్టుగానే… అలీబాబా కంపెనీ సింగిల్స్ డే పేరుతో ఆన్ లైన్ పండుగను నిర్వహించింది. నవంబర్ 11 న ఈ సింగిల్స్ డేను నిర్వహించింది. ప్రతి ఏటా ఈ సింగిల్స్ డేను నిర్వహిస్తుంది అలీబాబా. దాన్నే 11/11 గానూ పిలుస్తుంటారు. ఆరోజు చైనీయులు అలీబాబాలో విపరీతంగా కొనుగోళ్లు చేశారు. ఎంతలా అంటే… దాదాపు 31 బిలియన్ డాలర్ల అమ్మకాలు జరిగాయి. అదీ ఒక్కరోజే. మన కరెన్సీలో దాని విలువ ఎంతో తెలుసా? దాదాపు 2 లక్షల కోట్లు. వామ్మో అని నోరెళ్లబెట్టకండి.

సింగిల్స్ డే ప్రారంభమైన రెండు నిమిషాలలోనే 10 వేల కోట్ల రూపాయల కొనుగోళ్లు జరిగాయట. ఆన్ లైన్ లో మొత్తం 19 వేల వస్తువులను అమ్మకానికి పెట్టారట. మొత్తం 75 దేశాలకు చెందిన బ్రాండ్లను సింగిల్స్ డే రోజున అమ్మకానికి పెట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version