రైతులకు ప్రధాని మోడీ గుడ్ న్యూస్ చెప్పారు. దేశవ్యాప్తంగా రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశువుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు క్రిటికల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ (CADCP)కు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ పథకానికి రూ.3,880 కోట్లు కేటాయించగా, దీని ద్వారా పశువులకు వ్యాక్సిన్లు అందించడంతో పాటు, తక్కువ ఖర్చులో అవసరమైన మందులను అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక పశుఔషధ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.