చాలా శాతం మంది ధరించే బట్టలతో పాటుగా చెప్పుల పై కూడా ఎంతో శ్రద్ధ వహిస్తారు. వేసుకునే దుస్తులు ప్రకారం చెప్పులను, బూట్లను మారుస్తూ ఉంటారు. అయితే ఇలా చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాలలో కొత్త చెప్పులను ధరించడం వలన అవి కరుస్తూ ఉంటాయి. స్టైలిష్ గా మరియు మంచి లుక్ లో కనిపించేందుకు షూలను, చెప్పులను ఎక్కువగా కొనుగోలు చేసి ధరిస్తారు. కానీ మొదటి సారి వాటిని ధరించినప్పుడు అవి కరుస్తాయి. దీంతో ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. కనుక ఎప్పుడూ కూడా మీకు సౌకర్యం అనిపించిన చెప్పులను, షూలను మాత్రమే కొనుగోలు చేయాలి. ముఖ్యంగా కొత్తవి ధరించడం వలన కాళ్ల పై పుండ్లు వంటివి వస్తూ ఉంటాయి. కనుక తగిన చర్యలను వెంటనే తీసుకోవాలి. ముఖ్యంగా ఈ చిట్కాలను పాటించడం వలన వాటి నుండి ఉపశమనాన్ని పొందవచ్చు.
ఎప్పుడైతే కొత్త షూలు మరియు చెప్పులు వేసుకోవడం వలన పుండ్లు ఏర్పడతాయో, అప్పుడు అలోవెరా జెల్ ను అప్లై చేయాలి. అలోవెరా జెల్ ను రాయడం వలన ఎంతో ఉపశమనం లభిస్తుంది. ఇలా రాసిన తర్వాత 15 నిమిషాల వరకు ఉండి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ఎంతో ఉపశమనాన్ని పొందుతారు. అదే విధంగా చెప్పులు వలన పాదాలపై పుండ్లు ఏర్పడితే దానికి టూత్ పేస్ట్ రాయచ్చు. ఇలా చేస్తే గాయాలు త్వరగా మానుతాయి. చాలా శాతం మంది కొత్త చెప్పులను ధరించినప్పుడు అవి కరిచినా సరే వాటిని అలా వదిలేస్తారు. ముఖ్యంగా గాలి తగిలేలా ఉంచరు. ఇలా చేయడం వలన బ్యాక్టీరియా, క్రీములు ఎక్కువ అవుతాయి.
కనుక గాయాలు ఏర్పడిన వెంటనే గాలి తగిలే విధంగా ఉంచి, పాదాలను శుభ్రం చేసి ఏర్పడిన గాయాల పై ఆయింట్మెంట్ ను రాయాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేయడం వలన వాటిని త్వరగా తగ్గించుకోవచ్చు. చాలా మంది షూ లేక చెప్పులు వలన గాయాలు ఏర్పడినప్పుడు ఎంతో అశ్రద్ధ చేస్తారు. అలాంటి సమయంలో గాయాలు ఎక్కువ అవుతాయి. కనుక దానికి ఆలివ్ ఆయిల్ ను రాయడం వలన అవి త్వరగా మానుతాయి మరియు ఆలివ్ ఆయిల్ లో రెండు చుక్కల బాదం నూనెను కూడా కలిపి రాయవచ్చు. అదేవిధంగా ఇటువంటి పుండ్లు ఏర్పడకుండా ఉండాలంటే చెప్పులు లేక షూలను ధరించే ముందు పాదం వెనుక భాగంలో దూది ను ఉంచాలి. ఇలా చేయడం వలన పుండ్లు ఏర్పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి.