ఆ ద్వీపంలో బట్టలు లేకుండా 30 ఏళ్లగా ఒంటరిగా బతుకుతున్న వృద్దుడు..! అదే బాగుందట..!

-

ఒక్కోసారి కొన్ని వార్తలను విన్నప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వాళ్లు అసలు ఎలా ఇదంతా చేస్తున్నారు అనిపిస్తుంది. భార్యమీద కోపంతో భర్త కొన్నిఏళ్లపాటు నుంచి ఎయిర్‌పోర్టులోనే ఉంటున్నాడు. లోకకల్యాణం కోసం.. డవిలో ముప్పై ఏళ్లగా ఒంటిమీద నూలిపోగు కూడా లేకుండా బతికాడు అతను.. జపాన్‌కు చెందిన ఈ వృద్ధుడి జీవితం దాదాపు ఇలా అడవిలోనే గడిచింది. మధ్యలో ఓసారి జనావాసంలోకి తీసుకొచ్చినా లాభంలేదు. అసలేంటీ కథ..? ఎందుకు జనాలకు దూరంగా బట్టలు కూడా లేకుండా ఆదిమానవునిలా బతుకుతున్నాడు.?

జపాన్‌కు చెందిన 87 ఏళ్ల ముసఫూమీ నాగసాకి మూడు దశాబ్దాల కిందట ఓ ద్వీపానికి వెళ్లిపోయాడు. ఆ ఉష్ణమండల ద్వీపంలో ఒంటరిగా గడిపేవాడు. ఇంట్లో వాళ్లు మొదట అందుకు ఒప్పుకోకపోయినా అతని పట్టదల చూసి వాళ్లు ఏం చేయలేకపోయారు. ‘చావైనా బతుకైనా అక్కడే’ అని నాగసాకి గుడ్‌బై చెప్పి వెళ్లిపోయాడు. తర్వాత ద్వీపంలో ఆదిమానవుడిలా బతికేశాడు. నాగసాకి తన యాభైలలో ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నప్పుడు నాగరికతతో విసిగిపోయాడు. 1989లో, అతను తన భార్య, ఇద్దరు పిల్లలను విడిచిపెట్టి, జపాన్ ప్రధాన భూభాగానికి దక్షిణంగా వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న మంచినీరు కూడా లేని సోటోబనారి అనే ద్వీపానికి ఒంటరిగా వెళ్లిపోయాడట. .

ఉప్పు, అగ్గిపెట్టెలతోనే జీవనం..

రిమోట్ ద్వీపం దట్టంగా వృక్షసంపదతో ఉంది. జనసాంద్రత లేదు. నాగసాకి ద్వీపాన్నే తన నివాసం చేసుకుని ఇంటికి తిరిగి రాలేదు. సోటోబనారీని తన కొత్త ఇంటిగా మార్చుకున్నాడు. గత 29 సంవత్సరాలు అక్కడ ఒంటరిగా నివసించాడు. అగ్గిపెట్టె, కొవ్వొత్తులు, ఉప్పు వంటి వాటిని దగ్గర్లోని మరో ద్వీపానికి వెళ్లి కొనుక్కుని మళ్లీ తన ద్వీపానికి వచ్చేవాడు. అవి కొనుక్కోడానికి కుటుంబసభ్యులు డబ్బుల పంపేవాళ్లట.

ఈ క్రమంలోనే.. 2018లో బీచ్‌లో అపస్మారక స్థితిలో పడి ఉన్న అతన్ని స్థానిక మత్స్యకారుడు గుర్తించడంతో అతన్ని ద్వీపం నుండి తరలించారు. అతని ఆరోగ్యం కూడా బాగా దెబ్బతినడంతో.. నాగసాకి పట్టణానికి తిరిగి తీసుకుని వచ్చారు. అప్పుడే ఈ వృద్దుడిని ప్రపంచం గుర్తించింది.

కరోనా దెబ్బతో…

ఇలా ఉండగానే..కరోనా వచ్చేసింది. ఎక్కడికి కదల లేక.. ఇషిగాకి నగరంలో నాలుగు సంవత్సరాలు నివసించాల్సి వచ్చింది. అయితే ప్రశాంత వాతావరణం నుంచి వచ్చిన అతను కార్లు, బస్సుల రణగొణ ధ్వనులను, కలుషిత సమాజాన్ని భరించలేకపోయాడు. మళ్లీ తన ద్వీపానికి పోతానన్నాడు. ద్వీపం పిలుస్తోంది.. వెళ్ళిపోతా అంటూ పట్టుపట్టాడు. కన్నీళ్లతో అధికారులు కాళ్ళు పట్టుకున్నాడు. అధికారులు నచ్చ చెప్పినా వినకపోవడంతో.. సరేనని ఒప్పుకున్నారు. జూన్ 16న నాగసాకి మళ్లీ ఒంటరి అడవిలో వదిలేశారట.

ద్వీపానికి ఫేర్‌ వెల్‌ అంట..

నాగసాకిని తాత్కాలికంగానే పంపామని.. కొన్నాళ్లు అక్కడే ఉంచి ద్వీపానికి ‘ఫేర్ వెల్’ చెప్పించాక మళ్లీ తీసుకుని వచ్చేస్తామని అధికారులు అంటున్నారు. అతని ఆరోగ్యం బాగాలేదని, మానసిక ప్రశాంతత కోసం అలా టూరుకు పంపినట్లు పంపామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇతని వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది.

మన పుట్టకకు ఏదో ఒక కారణం, అర్థం, పరమార్థం ఉంటుందని పెద్దలు చెప్తారు..అందరిలా ఉద్యోగం పెళ్లి, పిల్లలు, మళ్లీ వాళ్లకు పెళ్లి, మనవరాళ్లు, టెన్షన్లు ఇలా కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో..ఎవరితో సంబంధం లేకుండా జీవితాన్ని అలా గడిపేస్తున్నాడు ఆ వృద్ధుడు. ఆదిమానవుల నుంచి మనం ఈ స్థాయికి వచ్చాం.. ఇతను మాత్రం ఆ లైఫే బాగుందంటున్నాడు.! యాక్చుల్‌గా మనకు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంది కదా.. అన్నీవదిలేసి ఈ ప్రపంచానికి దూరంగా ఎటైనా వెళ్లిపోవాలి అని.. కానీ మనం అనుకునే దగ్గరే ఆగిపోయాం..!

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version