మొదటిసారి ఇల్లు కొంటున్నారా..? అయితే ఈ విషయాలు మీకోసమే..!

-

చాలా మంది ఇల్లు కొనుగోలు చేయాలని ఈ కలలు కంటూ ఉంటారు. సొంతింటి కల సాకారం చేసుకోవాలనుకుంటే కొన్ని విషయాలను కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. మొదటిసారి మీరు ఇల్లు కొంటున్నట్లయితే ఈ జాగ్రత్తలు పక్కా తీసుకోండి. కలలు ఇంటిని కొనుగోలు చేసే ముందు అవసరం. బడ్జెట్ గురించి ఒక ప్లాన్ వేసుకోవాలి బడ్జెట్ పరిమితులోపు స్తోమతకు తగ్గ ఇంటిని వెతుక్కోవడం చాలా ముఖ్యం. ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు అనవసరమైన ఖర్చుల్ని తగ్గించుకోవాలి. తర్వాత మీరు అనుకున్న బడ్జెట్ లో ఇల్లు లేదా ఫ్లాట్ ని కొనొచ్చు అలాగే అనువైన ప్రదేశం చూసుకోండి.

రోడ్డు సదుపాయం, అన్ని రకాల రవాణా సౌకర్యాలు, స్కూల్స్, షాపింగ్ మాల్స్ లేదా కూరగాయల మార్కెట్ ఇలా మీకు అవసరానికి తగ్గట్టుగా అన్ని అందుబాటులో ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా అనువైన ప్రదేశాన్ని ఎంచుకోవడం వలన భవిష్యత్తులో ఇబ్బందులు రావు. అలాగే కనీస వసతులు ఉండేటట్టు చూసుకోండి పార్కింగ్, తాగునీరు, పవర్ బ్యాక్ అప్ వంటి సౌకర్యాలు ఇటువంటివి ఉండేటట్టు చూసుకోవాలి. ఇవి లేకపోతే కష్టమవుతుందని గుర్తుపెట్టుకోండి.

అలాగే ఇంటిని కొనుగోలు చేసే ముందు నిర్మాణంలో ఉన్న ఇంటిని తీసుకోవాలా లేదంటే ఫుల్లుగా తయారైపోయిన ఇంటిని తీసుకోవాలా ఇటువంటివన్నీ చూసుకుని వాటిలో ఉండే లాభనష్టాలని కూడా తెలుసుకొని ఆ తర్వాత మాత్రమే ప్రొసీడ్ అవ్వండి. ఒకవేళ మీరు ఎవరికైనా కాంట్రాక్ట్ ఇవ్వాలనుకున్న లేదంటే ఎవరి చేతైనా కట్టించుకోవాలనుకున్న వారి యొక్క గత ప్రాజెక్ట్స్ పరిశీలించండి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం వలన మీకు హెల్ప్ అవుతుంది ఇల్లు లేదా ఫ్లాట్ విలువ మాత్రమే కాదు రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంపు డ్యూటీ ఇలాంటివి కూడా చెల్లించాలి వీటన్నిటిని కూడా మీరు లెక్కపెట్టుకొని ఆ ఖర్చుకి సిద్ధంగా ఉండాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version