కుమార్తె ప్రేమకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన బిల్ గేట్స్.. ప్రపంచ కుబేరుడికి అల్లుడు ఇత‌నే..!

-

బిల్ గేట్స్ ఈ పేరు ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. ముప్పై సంవత్సరాల క్రితం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్‌ని స్థాపించి చరిత్రలో నిలిచిపోయిన బిల్‌గేట్స్ అత్యంత ధ‌న‌వంతుడుగా నిలిచాడు. అయితే ప్రపంచ కుబేరుల్లో ఒకరైన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, తన కుమార్తె ప్రేమ వివాహానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారు. బిల్, మెలిండా దంపతుల కుమార్తె జెన్నీఫర్ గేట్స్ (23)కు హార్స్ రేసర్ నయెల్ నాసర్ (29)తో నిశ్చితార్థం వైభవంగా జరిగింది. మంచుకొండల్లో వీరిద్దరి ఎంగేజ్ మెంట్ సాగగా, ఇప్పుడా ఫొటోలు వైరల్ అవుతున్నాయి. గత కొన్నాళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉండగా, వారి వివాహానికి బిల్ గేట్స్ అంగీకరించారు.

తామిద్దరమూ ఒకరిని ఒకరం అర్థం చేసుకున్నామని, భవిష్యత్తులో ప్రేమను పంచుకుంటూ ముందడుగు వేస్తామని ఈ సందర్భంగా జెన్నీఫర్ వ్యాఖ్యానించారు. ఆమె పోస్ట్ కు వేలకొద్దీ లైక్స్ రాగా, ఎంతో మంది అభినందనలు తెలుపుతున్నారు. ఇక ప్రపంచంలో తన అంత అదృష్టవంతుడు మరొకరు ఉండబోరంటూ నయెల్ నాసర్ చెప్పడం కొసమెరుపు. నాసర్ పేరెంట్స్ ఈజిప్ట్ నుంచి వచ్చి యూఎస్ లో స్థిరపడగా, నాసర్‌ చికాగోలో జన్మించాడు. అతనికి ఈజిప్టు పౌరసత్వం ఉన్న కారణంగా, హార్స్ రేస్ పోటీల్లో ఈజిప్ట్ తరఫున 2020 ఒలింపిక్స్‌ లో సైతం ఆడారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version