పెళ్లికొడుకు మోటు సరసం..పిచ్చిలేసి ఇచ్చిపడేసిన వధువు..

-

సాధారణంగా పెళ్లి చేసుకున్నాక భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతాయి.. కానీ ఇక్కడ ఏకంగా పెళ్లి మండపంలోనే వధూవరులు ఇద్దరు పిచ్చికుక్కల్లా కొట్టుకున్నారు. పెళ్లి వేడుక జరుగుతుంది. అతిథులు ఉన్నారు అని లేకుండా..జుట్టుపట్టుకోని మరీ ఒకరినినొకరు కొట్టేసుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. అసలు వాళ్లు ఎందుకు అలా కొట్టుకున్నారు. అంత కోపం ఎందుకు వచ్చిందో..!!
పెళ్లి వేడుక అప్పటివరకు హాయిగా జరిగిపోతోంది. అతిథులంతా వచ్చారు..అమ్మాయి అందంగా ముస్తాబై మండపానికి వచ్చింది. అబ్బాయి కూడా వచ్చాడు. వధూవరులు పరస్పరం స్వీట్స్ తినిపించుకునే ఘట్టం అండీ అది.. వధువుకు స్వీట్ తినిపించే క్రమంలో వరుడు కాస్త మొరటుతనం చూపించుకున్నాడు. అమ్మాయికి బలవంతంగా స్వీట్ నోట్లో వేసే కుక్కేశాడు. వరుడిని ఆపేందుకు అమ్మాయి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో అమ్మాయికి పిచ్చిలేసింది. అదే కోపంతో అబ్బాయిపై చేయి చేసుకుంది. వధువు అలా కొట్టేసరికి.. షాకైన వరుడు.. పబ్లిగ్గానే తనపై చేయిచేసుకుంటావా అంటూ తిరిగి కాస్త గట్టిగానే రెండు ఇచ్చాడు. ఈసారి వధువుకు మరింత కోపంతో పెళ్లి మండపం అని కూడా చూడకుండా అతడికి ఇచ్చిపడేసింది. ఈ క్రమంలోనే ఒకరిపై మరొకరు పరస్పరం దాడి చేసుకోవడమే కాకుండా.. జుట్టు పట్టుకోని మరీ లాక్కున్నారు.
వేదికపైనే నిలబడిన బంధువులు, మిత్రులు వధూవరులను ఆపేందుకు తీవ్రంగా శ్రమించారు..అయినా వాళ్లు వినలేదే..నువ్వా నేనా అనే రీతిలో కొట్టేసుకున్నారు..వాళ్లు కొట్టుకునే పనిలో బిజీగా ఉంటే.. ఈ తంతంగాన్ని అంతా ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఒక ట్విటర్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియోకు భారీ స్పందన వస్తోంది. వీడియో చూసిన నెటిజెన్స్ ఎవరికి నచ్చినట్లు వాళ్లు కమెంట్‌ చేస్తున్నారు. వధూవరులు కొట్టుకుంటున్న తీరు చూసి ” వీళ్లు పెళ్లి చేసుకుంటున్నారా ? లేక డైవర్స్ తీసుకుంటున్నారా ” అర్థం కావడం లేదంటూ సెటైర్స్ వేస్తున్నారు. మీరు కూడా ఓసారి ఆ వీడియో చూసేయండి.. పెళ్లి మండపంపై స్టెప్పులేసిన జంటలను చూశాం కానీ ఇలా కొట్టుకునే వాళ్లను ఇంతకు ముందు ఎప్పుడూ చూసి ఉండరేమో కదా..!!

Read more RELATED
Recommended to you

Exit mobile version