ఆచార్య చాణక్య ఎన్నో విషయాల గురించి చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన జీవితం చాలా బాగుంటుంది. చాణక్య నీతి ప్రకారం వీళ్ళు ఎవరికీ నచ్చరట. ఇలాంటి వాళ్ళు వారి లక్షణాలని మార్చుకోవడం మంచిది. చాణక్య నీతి ప్రకారం కుటుంబంలో అయినా సమాజంలో అయినా స్వార్థం గురించి మాత్రమే ఆలోచించే వాళ్ళని ఏ కుటుంబమైనా కూడా దూరం పెడుతుంది. అలాంటి వాళ్ళని అసలు కలుపుకోదు. అలాగే ఇతరులకి హాని కలిగించే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. ఇతరులకి హాని చేసే వాళ్ళను కుటుంబం మాత్రమే కాదు. సమాజం కూడా దూరం పెడుతుంది. కాబట్టి అలాంటి వాటిని మార్చుకోండి.
అలాగే అబద్ధాలు చెప్పకూడదు. అబద్ధాలు చెప్పే వాళ్ళని ఎవరు నమ్మరు. ఇలాంటి వారితో ఎవరు ఉండాలని కూడా అనుకోరు. అందుకే వీళ్ళని కుటుంబం దూరం పెడుతుందని ఆచార్య చాణక్య చెప్పారు ఎప్పుడూ కూడా నెగిటివ్ గా ఆలోచించే వాళ్ళని సమాజం దూరం పెడుతుంది. ఇలాంటి వాళ్లను తమకు తాముగా హాని చేసుకోవడమే కాకుండా సమాజానికి కూడా హాని చేస్తారు. కాబట్టి ఇలాంటి వాళ్లు వారి యొక్క స్వభావాన్ని మార్చుకోవడం మంచిది. సోమరిగా ఉండే వాళ్ళని కుటుంబ సభ్యులే కాదు సమాజం కూడా దూరం పెడుతుంది.
ఇలాంటి వ్యక్తులు కుటుంబానికి సమాజానికి భారం అయిపోతారు. చాణక్య ప్రకారం కుటుంబంలో అయినా సమాజంలో అయినా స్వార్థం గురించి ఆలోచించి ఇతరుల భావాలనే గౌరవించని వ్యక్తిని ఎప్పుడూ కూడా ఎవరైనా సరే దూరం పెడుతుంటారు. అదే విధంగా కుటుంబానికి ద్రోహం చేసే వాళ్ళు ఎవరైనా సరే ఇతర సభ్యులు ఆ కుటుంబం నుంచి దూరంగా పంపించేస్తారు. ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే మార్చుకోండి లేదంటే సమాజంలో అయినా కుటుంబంలో అయినా సరే మీకు విలువ ఉండదు మీకు గౌరవం ఉండదు. కనీసం మీ వలన ఎవరికి ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి వీటిని మార్చుకోండి లేదంటే అనవసరంగా మీరే సఫర్ అవ్వాలి.