కూలిపని చేస్తున్న కాకులు.. వీధుల్లో సిగరెట్ పీకలను ఏరడమే వాటి పని..!

-

కాకులు చాలా తెలివైన పక్షలు..నల్లగా ఉంటాయని ఎవరూ పెద్దగా ఇష్టపడరు. ఆహారం సంపాదించుకోవడానికి కాకులు వేసే ఎత్తుగడలు అన్నీ ఇన్నీ కావు. అందుకే స్వీడన్ లోని ఓ సంస్థ… కాకులకు ఉద్యోగాలు ఇస్తోంది. స్వీడన్లో సిగిరెట్ పీకలను తీసేసి ఓ బాక్సులో వేయటమే ఈ కాకుల పని..ఇందుకు కాకులకు జీతం రూపంలో ఆహారం ఇస్తుంది. భలే ఇంట్రస్టింగ్ గా ఉంది కదూ..ఇక వివరాల్లోకి వెళ్తే..
సంపన్నదేశమైన స్వీడన్ లో సహజంగానే రోడ్లు క్లీన్ గా ఉంటాయి. చుట్టూ పచ్చదనంతో, అక్కడక్కడా పూల మొక్కలతో పెయింటింగ్ వేసినట్లుగా కనిపిస్తాయి. కానీ.. ఈమధ్య అక్కడ సిగరెట్లు తాగేవారు పడేసే పీకలు ఎక్కువయ్యాయి. వాటితో పాటూ ఇతర చెత్త కూడా పెరుగుతోంది. ఇది గమనించిన ఓ సంస్థ… రోడ్లు ఊడ్చేందుకు మనుషుల్ని నియమించుకుంటే… భారీ ఖర్చు అవుతుందని భావించి… కాకుల్ని నియమించుకోవడం మొదలెట్టింది.
సోడెర్టాల్జే సిటీలోని వీధులను ఇప్పుడు కాకులు శుభ్రం చేస్తున్నాయి. సిగరెట్ పీకలు, రాళ్లు, చెత్తా చెదారాన్ని కాకులు పట్టుకెళ్లి… చెత్త డబ్బాల లాంటి ప్రత్యేక వెండింగ్ మెషిన్లలో వేస్తాయి..ఇలా చెత్త వెయ్యగానే అలా వాటి నుంచి ఆహారం బయటకు వస్తుంది. దాన్ని కాకులు తింటున్నాయి. ఇదోరకమైన పైలట్ ప్రాజెక్ట్. దీని పైరు కార్విడ్ క్లీనింగ్ (Corvid Cleaning). దీన్ని ది కీప్ స్వీడన్ టైడీ ఫౌండేషన్ నిర్వహిస్తోంది.
ప్రస్తుతం సోడెర్టాల్జే నగర వీధుల్ని శుభ్రం చెయ్యడానికి 20 మిలియన్ల స్వీడన్ల క్రోన్లు (Rs 16.28 crore) ఖర్చవుతోంది. అదే కాకులతో అయితే ఖర్చు 75 శాతం తగ్గుతుందని వారు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ పనిని హుడెడ్ జాతి కాకులు చేస్తున్నాయి. త్వరలోనే మాగ్పీస్, జాక్ డ్రాస్ జాతి కాకులతోనూ ఈ పని చేయిస్తారట.

కాకులతోనే ఎందుకు:

కాకులకు క్రమశిక్షణ ఎక్కువ. అవి తమను తాము చాలా క్లీన్ గా ఉంచుకుంటాయి. మనం ఎప్పుడు పెద్దగా గమనించి ఉండలేండి.. కానీ ఇది అయితే చూసే ఉంటాం.. ఒక కాకి చనిపోతే, మిగతా కాకులన్నీ ఆందోళన వ్యక్తం చేస్తాయి. ఒక కాకి బాధను మిగతా కాకులు పంచుకుంటాయి. ఇలా కాకులకు మనుషులలా ఆలోచించే లక్షణాలున్నాయి. పైగా ఇవి కొత్త విషయాల్ని చాలా త్వరగా నేర్చుకుంటాయట. అందుకే వాటితోనే ఈ పని చేయిస్తున్నారు. కాకుల జోలికి ప్రజలు రారు కాబట్టి… వాటికి పనికి ఎలాంటి అంతరాయం ఉండదు… పైగా పార్కుకి వచ్చే పర్యాటకులకు ఇవి ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

ఫ్రాన్స్ లో కూడా..

ఇదేమీ కొత్త ఐడియా కాదు. ఫ్రాన్స్ లో ఆల్రెడీ ఏళ్లుగా ఇది అమల్లో ఉంది. పశ్చిమ ఫ్రాన్స్ లో పుయ్ డు ఫౌ (Puy du Fou theme park) ధీమ్ పార్క్ లో కాకులు ఇలానే చేస్తాయట. అక్కడ ఆరు కాకులు రోజూ ఇదే పని చేస్తాయి. పార్కులో చెత్త, సిగరెట్ ముక్కలను ఏరుకొచ్చి ఓ డబ్బాలో వేస్తాయి. అక్కడ కూడా చెత్త వేశాక ఆహారం బయటకు వస్తుంది. దాన్ని కాకులు తింటాయి.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version