నిద్రపోయినప్పుడు వచ్చే కలలు రేపటి భవిష్యత్తుకు సంకేతాలంటివని పండితులు అంటారు. మన ప్రస్తుత పరిస్థితులను ఆలోచనా విధానం ఆధారంగానే కలలు వస్తాయని సైన్స్ అంటుంది. అయితే స్వప్న శాస్త్ర ప్రకారం.. కలలకు చాలా ప్రాముఖ్యత ఉంది.. వచ్చే ప్రతికల ఏదో తెలియని విషయాన్ని చేరవేస్తుంది. వాటిని గ్రహిస్తే..జరగబోయే చెడును ముందే ఆపవచ్చట. కలలో మీరు ఎప్పుడైనా విమానం చూశారా..? విమానం ఇది కనిపించే విధానం బట్టి అర్థం మారిపోతుందట.. మరి స్వప్నశాస్ర్రం ప్రకారం.. కలలో విమానం కనిపిస్తే దేనికి సంకేతమో చూద్దామా..!
రన్‌వేపై ఉన్న విమానం కనిపిస్తే.. మీ కలలో రన్‌వేపై నిలిచి ఉన్న విమానం కనిపిస్తే.. మీరు చాలా కాలంగా నిమగ్నమై ఉన్న పని త్వరలో పూర్తవుతుందని సంకేతం. త్వరలో మీరు అలాంటి అవకాశాన్ని పొందవచ్చు.
విమానం టేకాఫ్ అవుతున్నట్లు కల వస్తే.. విమానాశ్రయం నుండి విమానం టేకాఫ్ అవుతున్నట్లు కల రావడం కూడా మంచికే సంకేతం. ఇది మీ పని విస్తరణను సూచిస్తుంది. ఇది భవిష్యత్ విజయాన్ని సూచిస్తుంది.
చాలా విమానాలు కనిపిస్తే.. మీరు కలలో చాలా విమానాలు చూస్తే… మీరు త్వరలో ఆర్థికంగా బలపడతారని అర్థం. మీరు త్వరలో ధనవంతులు అవుతారని ఈ కలకు అర్థమట.!
విమానంలో ప్రయాణం.. మీ కలలో మీరు విమానంలో ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తే.. మీ కలలు కొన్ని త్వరలో నెరవేరుతాయని అర్థమట… ఇది మీ పనిలో గొప్ప విజయాన్ని సూచిస్తుంది. ఇది చాలా పవిత్రమైన కలగా పరిగణించబడుతుంది
విమాన ప్రమాదం కనిపిస్తే.. మీ కలలో విమానం కూలిపోయినట్లు వస్తే అది అశుభకరమైన కలగా స్వప్నం శాస్త్రం పరిగణించబడుతుంది. అంటే మీరు పూర్తి శ్రమతో చేస్తున్న పనికి ఆటంకం ఏర్పడవచ్చు. అంతేకాకుండా, ఇది మీ ఆరోగ్యం చెడిపోయిందనడానికి కూడా ఒక సంకేతమట.
భారీ విమానం కనిపిస్తే.. మీ కలలో చాలా పెద్ద విమానాన్ని చూసినట్లయితే, మీ కోరికలో కొన్నింటిని మీరు ఊహించలేని విధంగా త్వరలో నెరవేరుతుందని అర్థం. ఇది అఖండ విజయానికి సంకేతంగా చెప్పవచ్చు.
సో.. ఇది మ్యాటర్..వీటికి ఆధారాలు లేవు. కేవలం స్వప్న శాస్ర్రంలో ఉన్నదే అందించడం జరిగింది. నమ్మడం నమ్మకపోవడం పూర్తిగా మీ ఇష్టం.. మనలోకం సొంతంగా ఊహించుకుని రాసింది కాదని మాత్రం గమనించగలరు.!