ప్ర‌పంచ వ్యాప్తంగా చాన‌ల్స్ నిర్వాహ‌కుల‌కు యూట్యూబ్ ఎంత చెల్లించిందో తెలుసా..?

-

ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా చాలా మంది యూట్యూబ్ చాన‌ల్స్ ను నిర్వ‌హిస్తూ అధిక మొత్తంలో ఆదాయం సంపాదిస్తున్నారు. యూట్యూబ్ చాన‌ల్‌ను ఏర్పాటు చేయ‌డం, నిర్వ‌హించ‌డం చాలా తేలికైన త‌రుణంలో చాలా మంది దీన్నే స్వ‌యం ఉపాధి మార్గంగా ఎంచుకుంటున్నారు. అయితే 2020లో ప్ర‌పంచ వ్యాపంతంగా ఉన్న యూట్యూబ్ కంటెంట్ క్రియేట‌ర్లు, ఆర్టిస్టులు, మీడియా కంపెనీల‌కు 30 బిలియ‌న్ డాల‌ర్ల‌ను చెల్లించిన‌ట్లు యూట్యూబ్ సీఈవో సూస‌న్ వొజ్‌సికి తెలిపారు.

కాగా ఆక్స్‌ఫ‌ర్డ్ ఎక‌నామిక్స్ రిపోర్టు ప్ర‌కారం.. 2019లో యూట్యూబ్ ద్వారా వ‌చ్చిన 16 బిలియ‌న్ డాల‌ర్ల ఆదాయం వ‌ల్ల ఆ దేశ జీడీపీ పెరిగేందుకు ఉప‌యోగ‌ప‌డింది. అదేవిధంగా 3.45 ల‌క్ష‌ల మందికి పూర్తి స్థాయి ఉద్యోగాలు ల‌భించిన‌ట్లు అయింది. యూకే జీడీపీ పెరిగేందుకు యూట్యూబ్ ద్వారా వ‌చ్చిన 1.4 బిలియ‌న్ పౌండ్ల ఆదాయం ఉప‌యోగ‌ప‌డింది. దీంతో అక్క‌డ 30వేల మందికి పూర్తి స్థాయి ఉద్యోగాలు వ‌చ్చిన‌ట్లు అయింది.

అలాగే యూట్యూబ్ నుంచి వ‌చ్చిన 515 మిలియ‌న్ల ఆదాయం వ‌ల్ల ఫ్రెంచ్ జీడీపీ పెరిగింది. దీంతోపాటు 15వేల మందికి పూర్తి స్థాయి ఉద్యోగాలు ల‌భించిన‌ట్లు అయింది. ఇక 2021లో ప్ర‌పంచంలో యూట్యూబ్ ద్వారా కంటెంట్ క్రియేట‌ర్ల‌కు మ‌రింత ఆదాయం వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని సూస‌న్ అంచ‌నా వేశారు. అయితే 2020లో చాలా వ‌ర‌కు గేమింగ్ చానల్స్‌ లైవ్ స్ట్రీమ్‌లు చేశాయ‌ని, గ‌తంలో క‌న్నా ఈ స్ట్రీమ్స్ ను చూసే వారి సంఖ్య‌, చేసే వారి సంఖ్య భారీగా పెరిగింద‌ని, అందుకు లాక్‌డౌన్ కార‌ణ‌మ‌ని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version