మనిషి అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే.. తినే ఆహారం చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. మీరు యాక్టివ్‌గా పనిచేసుకోవాలి అంటే. మంచి పోషకాలు ఉన్న ఆహారం తినాలి. అలాగే చక్కటి జీవనశైలిని పాటిస్తే.. శరీరంలో ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది. లావు పెరగడం, తగ్గడం ఇలాంటి సమస్యలు ఉండవు. ఈరోజు గాంధీ జయంతి. మహాత్మా గాంధీ పేరు గుర్తుకురాగానే..మనకు ఎప్పుడు ఒకే టైప్ విజువల్ మన కళ్లలో మెదులుతుంది. గాంధీజి ఎప్పుడు బక్కపలచగానే ఉండేవాళ్లు. ఆయన లావుగా ఉన్నట్లు మీరు ఎక్కడైనా చూశారా..? అసలు మహాత్మా గాంధీ ఎలాంటి ఆహారాన్ని తినేవాళ్లు. ఆ యవసులో కూడా అంత యాక్టివ్‌గా ఉన్నారంటే.. వాళ్లు పాటించిన డైట్ ఏంటి..?
మహాత్మా గాంధీజీ ఎప్పుడూ సాధారణ ఆహారాన్ని ఇష్టపడేవారు. అలాగే తరచుగా పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు తినేవాళ్లు.. మొలకెత్తిన గింజలు, జిలేబీ, హల్వా అంటే బాపూకి బాగా ఇష్టమని అంటారు. స్వాతంత్య్రోద్యమ కాలంలో గాంధీజీ ఎన్నోసార్లు తిండికి దూరమయ్యారు.
మహాత్మా గాంధీ ఖిచ్డీ, దాల్ మఖానీ, బిర్యానీ మొదలైన వాటిని తినడానికి ఇష్టపడతారని నమ్ముతారు. గాంధీకి బిర్యానీలో వాడే గింజలంటే చాలా ఇష్టమట. ఇది కాకుండా, గాంధీజీకి భజియా, మెంతి చట్నీ అంటే చాలా ఇష్టం.
గాంధీజీ గుజరాతీ కుటుంబం నుండి వచ్చినందున, రోటీ అతని ఆహారంలో ముఖ్యమైన భాగం.రోజూ రొట్టెలు తినేవాడు. గాంధీజీకి స్వీట్లలో పేడా తినడమంటే చాలా ఇష్టం. గుజరాతీలు దీన్ని డెజర్ట్‌గా ఎక్కువగా తినేవారు. గాంధీజీకి ఇష్టమైన స్వీట్లలో ఇది ఒకటి.
గాంధీజీ సాధారణ ఆహారాన్ని ఇష్టపడేవారు. కోపాన్ని పెంచే ఆహారపదార్థాలు తినడం మానేశాడు. కాబట్టి వారు నూనె, ఉప్పు లేకుండా వండిన కూరగాయలను తిన్నారు. ఇందులో ఉడికించిన బీట్‌రూట్ కూడా ఉంటుంది.
మహాత్మా గాంధీ కూడా బాదామీ పాలు తాగడానికి ఇష్టపడేవారని చెబుతారు. ఇది వారి ఆహారంలో ముఖ్యమైన భాగం ఇది. నిత్యం బాదంపాలు తాగేవాళ్లట.