అక్రమంగా డబ్బులను సంపాదించే వారికి,సమయానికి పన్ను కట్టని వారి ఇల్లపై ఎసీబి దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే..ముఖ్యంగా రాజకీయ, సినీ ప్రముఖ ఇళ్లపై ఎక్కువగా ఈ దాడులు జరుగుతాయని తెలుసు..ఎన్నో కోట్లు డబ్బులను అధికారులు స్వాధీనం చేసుకుంటారు.ఆ డబ్బులను ఎక్కడకు పంపిస్తారు.అసలేం చేస్తారు అనే విషయం అందరికి అర్థం కాదు..ఎక్కడికి పోతుంది అనే డౌట్ సహజమే..దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం…
కార్యకలాపాల్లో పాల్గొన్న వారి చర, స్థిరాస్తులను స్వాధీనం చేసుకునే అధికారం, విచారణ నిర్వహించే అధికారం ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖలకు ఉంటుంది. స్వాధీనం చేసుకున్న డబ్బును తమ కస్టడీలోకి తీసుకుంటాయి. ఆపై కోర్టు ఆదేశం మేరకు.. డబ్బు నిందితులకు తిరిగి ఇచ్చేస్తారా లేదా ప్రభుత్వానికి ఇస్తారా అనే చిక్కు ప్రశ్నగా మిగిలిపోయింది.ఈ దాడుల తర్వాత అసలు ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూడండి..దాడులు జరిగిన తర్వాత సీజ్ చేసిన ఎమౌంట్ ను కోర్టులో సమర్పిస్తారు.
*ఆ డబ్బును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కేంద్ర ప్రభుత్వ ఖాతాలో జమ చేస్తాయి.కొన్నిసార్లు కొంత డబ్బును ఉంచుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు, అంతర్గత ఆర్డర్ ద్వారా కేసు విచారణ పూర్తయ్యే వరకు దర్యాప్తు సంస్థ దానిని తన వద్దే ఉంచుకుంటుంది.
* ఈవీ ఏదైనా ఆస్తిని అటాచ్ చేసినప్పుడు.. ఆ ఆస్తిని కొనడం లేదా విక్రయించడం లేదా ఉపయోగించడం సాధ్యం కాదు. అయితే ఇల్లు, వాణిజ్య ఆస్తిని జోడించినప్పుడు వాటి వినియోగానికి మినహాయింపు కూడా ఉంది.గరిష్టంగా 180 రోజులు అంటే 6 నెలల వరకు ఆస్తిని అటాచ్ చేయవచ్చు. అప్పటికి ఈడీ కోర్టులో ఆస్తి అటాచ్‌మెంట్‌ను చట్టబద్ధం చేయలేకపోతే, 180 రోజుల తర్వాత ఆస్తి విడుదలవుతుంది.
*ఈడీ చర్యపై ఉన్నత న్యాయస్థానాలలో అప్పీల్ చేయడానికి నిందితుడికి 45 రోజుల సమయం లభిస్తుంది.బంగారం, వెండి ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు జప్తు చేసి ప్రభుత్వ గోదాములో నిక్షిప్తం చేస్తారు.
* విచారణ తర్వాత కోర్టు జప్తునకు ఆదేశిస్తే, ఆస్తి మొత్తం ప్రభుత్వానికి చెందుతుంది. జప్తును కోర్టులో ఈడీ సమర్థించుకోలేకపోతే, ఆస్తిని సంబంధిత వ్యక్తికి తిరిగి ఇచ్చేస్తారు. కొంత జరిమానా విధించడం ద్వారా ఆస్తిని తిరిగి ఇవ్వడానికి చాలాసార్లు కోర్టు అంగీకరించింది. ఆస్తి పన్ను కట్టిన తర్వాత మళ్ళీ తిరిగి ఇవ్వడం పై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి..