డ్రంక్ డ్రైవ్ టెస్ట్ చేసిన పోలీసులకు అతని కారు చూసి మైండ్ పోయింది

-

ఏడాది మొత్తం తాగింది ఒక ఎత్తు న్యూఇయర్ రోజు తాగింది ఒక ఎత్తు… ఎంత తాగుతున్నారో ఎం తాగుతున్నారో కూడా తెలియకుండా తాగుతూ ఉంటారు కొందరు. ప్రపంచాన్ని మర్చిపోయి సమస్యలు అన్ని మర్చిపోయి ఆ రోజు తాగే మందు అంతా ఇంతా కాదు. కొంత మందికి తాగి ఎం చేస్తున్నారో కూడా సోయి ఉండదు. తాజాగా అలాంటి వ్యక్తే ఒకడు ఇంగ్లాండ్ లో పోలీసులకు చుక్కలు చూపించాడు. ఇష్టం వచ్చినట్టు తాగి టైర్లు లేని కారు వేసుకుని వెళ్ళిపోయాడు.

ఒక వ్యక్తి న్యుఇయర్ సందర్భంగా ఫుల్లుగా మద్యం తాగాడు. అంత వరకు బాగానే ఉంది. ఈ సమయంలో కారు వేసుకుని బయటకు వచ్చాడు… తన కారు వేసుకుని వేగంగా వెళ్ళిపోతున్నాడు. పెద్ద శబ్దంతో కారు దూసుకు వస్తుంది. దాన్ని చూసి పోలీసులు కంగు తిన్నారు. కారుని ఆపి చూడగా ఆ కారుకి టైర్లు లేవు. వెంటనే అతడికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసారు. ఆల్కహాల్ శాతం వంద గ్రాములకు మించి,

196 గ్రాములకు వెళ్ళడంతో పోలీసులకు కూడా అతన్ని చూసి మతిపోయింది. రెనాల్ట్ క్లియో కారుకు ముందు టైర్లు లేవు. ఈ ఘటన ఇంగ్లండ్‌లో గ్రేట్ మాంచెస్టర్‌లో జరిగింది. అతను డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకడం చూసి తమకు పెద్దగా ఆశ్చర్యం లేదు గాని కారుకి టైర్లు కూడా లేకుండా రావడం చూసి మతి పోయిందని పోలీసులు చెప్పారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version