ప్రస్తుతం మన దేశంలో రేట్ల ఎరుగుదల అనే విషయానికి వస్తే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి పెట్రోల్, గ్యాస్ సిలిండర్ అనే చెప్పాలి. ఈ రెండింటి ధరలు ఇప్పటికే విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో సామాన్యుడి జేబుకు చిల్లులు పడుతున్నాయి. ఇక ఇప్పుడు ఈ కరోనా పరిస్థితుల్లో కూడా వీటి ధరలు ఆకాశాన్ని అంటేలా ఉన్నాయి. వరుసగా పెరగడమే తప్ప తగ్గడం అనేది లేనే లేదు. ఇక ఇప్పుడు ఎన్ని విమర్శలు వస్తున్నా ప్రజల నుంచి ఎన్ని విజ్ఞప్తులు వస్తున్నా కూడా వీటి ధరలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి.
ఇక ఇదే క్రమంలో ఇప్పుడు మరోసారి పెట్రోలియం కంపెనీలు దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను పెంచడం సంచలనం రేపుతోంది. అయితే వీటిని సబ్సిడీయేతర సిలిండర్లపై ఏకంగా రూ.25 పెంచడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీని ధరలు ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ రేటు రూ. 859.5 గా ఉంది. కాగా దీని ధరలు పెరగక ముందు రూ.834.50గా ఉండేది. ఇక గతంలో జూలై 1వ తేదీన LPG సిలిండర్ ధర రూ.25.50 పెరిగిన సంగతి తెలిసిందే.
ఇక దేశఃలో మరో ముఖ్య నగరమైన ముంబైలో కూడా 14.2 కిలోల సిలిండర్ రేటు ఇప్పుడు రూ.859.5 కాగా మొన్నటి వరకు దీని రేటు రూ .834.50గా ఉండేది. ఇక పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతా నగరంలోరూ .861 నుండి రూ. 886 కి పెరిగిందని తెలుస్తోంది. ఇక మన దగ్గర కూడా రూ.25 పెరగడంతో సామాన్యులు భగ్గుమంటున్నారు. ఇలా రోజురోజుకూ పెరగడమేంటని అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పెరిగిన ధరలు కాస్త సబ్సిడి దారులకు వర్తించవని ఇప్పటి వరకు వార్తలు వినిపిస్తున్నాయి.