వానలు వలన కప్పలు వస్తాయి.. కానీ ఇలా చేస్తే మాత్రం రావు..!

-

వానా కాలంలో చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి అలానే వానా కాలంలో కీటకాల సంఖ్య కూడా బాగా పెరిగి పోతుంది. కప్పలు కూడా ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాయి. వాన కాలంలో ఎక్కువగా కప్ప వంటివి గార్డెన్ లో కనబడుతుంటాయి అలానే ట్యాంక్, బాత్రూం వంటి చోట్ల కూడా కనబడుతూ ఉంటాయి. అయితే కప్పలు రాకుండా ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు చూసేద్దాం. కప్పాలని తరిమేయడానికి ఉప్పును వాడొచ్చు.

 

ఉప్పు వాన కాలంలో ఇటువంటి వాటిని తరిమికొట్టడానికి ఉపయోగపడుతుంది. ఉప్పుని నీళ్లలో వేసి ఎక్కడైతే కప్పలు ఎక్కువగా చేరుతున్నాయో అక్కడ చల్లండి ఇలా చేయడం వలన కప్పలు రావు. ఇంటి చుట్టూ కప్పలు చేరకుండా ఉండాలంటే కాఫీ కూడా బాగా ఉపయోగపడుతుంది కొద్దిగా గోరు వెచ్చని నీళ్ల లో కాఫీ పొడిని వేసి స్ప్రే బాటిల్ లో వేసి ఈ నీటిని స్ప్రే చేస్తూ ఉండండి.

ఇలా చేయడం వలన కప్పలు రావు. బ్లీచింగ్ పౌడర్ కూడా బాగా ఉపయోగపడుతుంది. నీళ్ల లోని బ్లీచింగ్ పౌడర్ ని కలిపి దాన్ని స్ప్రే చేస్తే కూడా కప్పలు చేరకుండా ఉంటాయి. ఇలా సులభంగా కప్పలు లేకుండా చేసుకోవచ్చు. కప్పలు ఎక్కువగా కీటకాలు తెగుళ్లు ఉన్న చోటకి వస్తూ ఉంటాయి అలా కాకుండా మీరు మీ గార్డెన్ శుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుంది. కప్పలు బాధ కూడా ఉండదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version