దేవుడా..ఫుట్‌బాల్ అంటే ఇంత పిచ్చా..రూ.23 లక్షలు ఖర్చు చేసి మరీ..

-

ఫిఫా వరల్డ్ కప్ ఆదివారం ఖతర్ వేదికగా ప్రారంభమైన సంగతి తెలిసిందే.ఫుట్‌బాల్ ప్రియులకు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఓ సారి వచ్చే పండుగ వంటిది..మ్యాచ్ ను చూడటానికి అన్నీ మర్చిపొతారు.ఆకలిదప్పికలు మరిచిపోయే అభిమానులు కొన్ని కోట్ల మందే ఉన్నారు. మన దేశంలో మ్యాచ్ లేకున్నా కూడా ఫ్యాన్స్ ఉన్నారు.ఖతర్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ ఫీవర్ ఎక్కువయింది. మన దేశంలో ముఖ్యంగా కేరళలో ఫుట్ బాల్ ప్రేమికులు ఆటపై తమ ప్రేమాభిమానాలను విభిన్న రీతిల్లో ప్రకంటించుకుంటున్నారు.

తాజాగా కేరళకు చెందిన కొందరు కూడా ఇదే తరహాలో తమ అభిమానాన్ని చాటుకున్నారు. కేరళలోని కొచ్చి జిల్లా ముండక్కముగల్ గ్రామానికి చెందిన 17 మంది స్నేహితుల బృందం ఫుట్‌బాల్‌పై మక్కువతో ఏకంగా ఇంటినే కొనుగోలు చేశారు.అందరూ కలిసి ఒకేచోట మ్యాచ్‌ను చూసేందుకు వీలుగా 23 లక్షల రూపాయలతో ఆ ఇంటిని కొనుగోలు చేసి దానిని ఒక మినీ హాల్‌గా మార్చుకున్నారు. ప్రపంచ కప్ నేపథ్యంతో వారు కొనుగోలు చేసిన ఇల్లు బ్రెజిల్, అర్జెంటీనా, పోర్చుగల్ జెర్సీ రంగులతో ఉంది.

మరో విశేషమేమిటంటే.. ఈ స్నేహితులందరూ కలిసి లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో ​​రొనాల్డో సహా ఫుట్‌బాల్‌ ఆటలోని సీనియర్ ప్లేయర్లలో కొంతమంది ఫొటోలతో తమ ఇంటిని అలంకరించారు..కొన్నేళ్ళ నుంచి ఇక్కడ మ్యాచ్ ను తిలకిస్తున్నారు.నవంబర్ 20 ఆదివారం రాత్రి 9:30 గంటలకు ప్రారంభమయిన వరల్డ్ కప్ ఖతార్ 2022 టోర్నమెంట్ మొదటి మ్యాచ్‌లో.. ఆతిథ్య ఖతర్ జట్టుతో ఈక్వెడర్ తలపడింది. ఈ ఆటలో ఈక్వెడర్ 20 ఆధిక్యంతో ఖతర్ జట్టుపై గెలుపొందింది.. ఇప్పుడు ఈ ఇంటికి సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఎంత ఇష్టం వుంటే ఇలా చేస్తారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version