ఐటీ అధికారులు ఇంట్లోకి రాకుండా డోర్ లాక్ చేసుకున్న మల్లారెడ్డి సన్నిహితుడు

-

మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పలు బృందాలుగా విడిపోయిన అధికారులు మల్లారెడ్డి, ఆయన కుమారుడు మహేందర్ రెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఇల్లు, వ్యాపార సముదాయాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 50 బృందాలు ఏకకాలంలో ఈ తనిఖీలలో పాల్గొన్నాయి.

ఈ తనిఖీలలో భాగంగా కొంపల్లి సమీపంలోని సుచిత్ర లో ఉంటున్న మంత్రి మల్లారెడ్డి బంధువు త్రిశూల్ రెడ్డి ఇంట్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. త్రిశూల్ రెడ్డి ఇంట్లో 2 కోట్ల నగదును సీజ్ చేశారు ఐటీ అధికారులు. తాజాగా జీడిమెట్లలో మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి సన్నిహితుడు రఘునాథ్ రెడ్డి ఇంట్లోనూ నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ కూడా రెండు కోట్లు సీజ్ చేశారు. ఇదిలా ఉంటే.. ఐటీ అధికారులు మంత్రి మల్లారెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన సంతోష్ రెడ్డి ఇంటికి కూడా వెళ్లారు.

అయితే ఐటి అధికారులు రావడం గమనించిన సంతోష్ రెడ్డి ఇంట్లో నుంచి డోర్లు లాక్ చేసుకున్నాడు. ఆయన తలుపులు తెరవడం లేదు. దీంతో ఇంట్లోకి ఎలాగైనా వెళ్లాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. మల్లారెడ్డి ఆర్థిక వ్యవహారాలన్నీ సంతోష్ చూసుకుంటారు. దీంతో ఆయన ఇంట్లో తనిఖీలలో కీలక ఆధారాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version