చివరి దశలో ఉన్న బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 27 ఏళ్ల గుజరాత్ అమ్మాయి, వాయు కాలుష్యాన్ని తరిమికొట్టడానికి గానూ, 30,000 చెట్లను నాటి ఆశ్చర్యపరిచింది. గుజరాత్ సూరత్ నగరంలో నివసిస్తున్న శ్రుచి వడాలియాకు కొన్ని నెలల క్రితం ఈ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది, ఆ తరువాత ఆమె పర్యావరణాన్ని కాపాడటానికి ఒక ప్రచారాన్ని ప్రారంభించింది.
ఆమె క్యాన్సర్ అభివృద్ధి చెందడానికి వాయు కాలుష్యం కారణమని, ఎక్కువ చెట్లను నాటితే చాలా మంది ప్రాణాలను ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షించవచ్చని గమనించి మొక్కలు నాటడం మొదలుపెట్టింది. “నేను త్వరలోనే చనిపోవచ్చు, కాని ఎక్కువ చెట్లను నాటడం ద్వారా ప్రజల శ్వాసలో జీవించాలనుకుంటున్నాను” అని వడాలియా మీడియాకు వివరించారు. ఆమె గత రెండేళ్ళలో 30,000 కి పైగా చెట్లను నాటారు.
తన సన్నిహితులను కూడా ఇదే విధంగా ఆమె ప్రోత్సహించింది. ప్రాణాంతక వ్యాధి ఉన్నప్పటికీ, ఆమె మాత్రం వెనక్కు తగ్గలేదు. “నా జీవితాన్ని గడపడానికి మరియు కలలను నెరవేర్చడానికి నాకు తగినంత సమయం లేదు, కాని ఇతరులు కూడా అదే విధంగా ఎదుర్కోవాలని నేను కోరుకోను. అందువల్ల, మొక్కలను నాటాలి, ఇది గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది మరియు క్యాన్సర్‌ను నివారిస్తుంది” అని వడాలియా చెప్పారు.