పాకిస్తాన్ లో సంచలనం జరిగింది. మరణించిన మహిళ తిరిగి మళ్ళీ బ్రతికింది. వివరాల్లోకి వెళితే, రషీదా బీబీ అనే 50 ఏళ్ల మహిళను కరాచీలోని అబ్బాసీ షాహీద్ ఆస్పత్రికి కుటుంబ తీసుకెళ్లారు. ఆమెను పరిశీలించిన వైద్యులు మరణించిందని చెప్పి డెత్ సర్టిఫికెట్ ఇచ్చి పంపించారు. దీనితో కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. ఆమె చనిపోయిందని బంధు మిత్రులకు సమాచారం ఇచ్చారు.
కుటుంబం మొత్తం గుండెలు పగిలేలా రోదిస్తుంది. ఇక అంత్యక్రియలు ఏర్పాటు చేసి అందులో భాగంగా రషీదా బీబీ మృతదేహాన్ని ఓ గదిలో కుర్చీలో కూర్చోబెట్టి, తలపై నుంచీ నీళ్లు పోస్తుండగా, ఆమె చేతి వేళ్ళు కదలడం గమనించారు. ఆ విషయాన్ని ఒక వ్యక్తి పక్కని వారితో చెప్పగా అందరూ గమనించారు. వేళ్ళు కదలడం అందరికి అర్ధమైంది. వెంటనే ఆమె పల్స్ చెక్ చేయగా… ఆమె నాడి కొట్టుకుంటుందని,
శ్వాస కూడా పీలుస్తుందని, అర్థమై వెంటనే ఆమెకు పొడి దుస్తులు వేసి, వెంటనే అదే ఆస్పత్రికి తీసుకువెళ్ళారు. మరోసారి పరిశీలించిన డాక్టర్లు ఆమె బ్రతికి ఉండటం గమనించి ఆశ్చర్యపోయి ఆమెకు వైద్యం చేసారు. ఇక్కడ డాక్టర్ల తీరుని పలువురు తప్పుబడుతున్నారు. అసలు పరిక్షలు వాళ్ళు చేయలేదని, వాస్తవానికి చనిపోయిన మనిషి తిరిగి బ్రతికే అవకాశం ఉండదని, వైద్యులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.