ఈ మధ్య.. బస్ హోమ్ కల్చర్ ఎక్కువైంది. ఓ బస్సునే ఇళ్లులా మార్చేసుకుని.. అందులో రోజుకో ప్లేసుకు వెళ్లి ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా తిరిగి ఇంటికి రావాలి అనే కాన్సప్ట్ ఉండదు. ఇల్లే మనతో వచ్చేస్తుంది కదా..! వెళ్లినవాళ్లు ఊరికే ఉంటారా.. తిరిగి చోటును, వాళ్లు ఎంజాయ్ చేసినదంతా.. కెమేరాలో బంధించి సోషల్ మీడియాలో వదల్తున్నారు. ఇలానే చేస్తున్న ఫ్యామిలీ బస్సును బార్బీ బొమ్మ థీమ్ తో తీర్చిదిద్దుకుంది. ఇప్పుడు ఇదే అందరినీ ఆకక్షిస్తుంది.
33 ఏళ్ల అరియానా అమెరికా… కాలిఫోర్నియా నివాసి. 56 ఏళ్ల ఎరిక్తో కలిసి… 2020 ఆగస్టులో ఇల్లు లాంటి బస్సును కొన్నారు. ఆ తర్వాత దాన్ని బార్బీ డాల్లా ఎలా మార్చాలో ప్లాన్ వేసుకున్నారు. బార్బీ థీమ్లోకి మార్చేందుకు రూ.లక్షన్నర ఖర్చైందట. అరియానా బాల్లెట్ డాన్సర్, ఎరిక్… డిజైనర్. వీళ్లిద్దరూ… వీలైనంత ఎక్కువ సమయం ట్రావెలింగ్కే కేటాయిస్తారు.. ఇద్దరికీ పింక్ కలర్ అంటే ఇష్టమే అందుకే ఈ థీమ్ తీసుకున్నారు..
ఈ బస్సులో సోఫాలు, కుషన్లు, వస్తువులు అన్నీ పింక్లోనే ఉంటాయి. అందుకే వీళ్లు ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఈ బస్సువైపు ఆసక్తిగా చూస్తున్నారట. చాలా మంది మంచి కాన్సెప్ట్ అని ప్రశంసలు కూడా ఇస్తున్నారు. పార్కింగ్ సమస్యలు తప్పితే మరే ఇబ్బందీ తమకు కలగట్లేదని ఈ ఫ్యామిలీ అంటోంది.
ఈ జంట కాలిఫోర్నియా నుంచి ఫ్లోరిడా వరకూ ఏడాదిలో మూడుసార్లు తిరిగింది. కొత్త ప్రదేశాలకు వెళ్లిన చోట మ్యూజికల్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంటారు.. తద్వారా అరియానా మనీ సంపాదిస్తోంది. ఎరిక్ ఆన్లైన్లో డిజైన్స్ క్రియేట్ చేస్తూ డబ్బులు సంపాదిస్తాడు. వీళ్లకు బస్సులో గ్యాస్ నింపేందుకు నెలకు రూ.30,000 ఖర్చవుతోంది. ఖర్చులు పోగా కొంత ఆదాయాన్ని వెనకేస్తున్నారు.
ఇలాంటి కథలు విన్నప్పుడు భలే అనిపిస్తుంది కదా.. అందరూ.. ఇల్లుకట్టాలి, కష్టపడాలి అంటూ లైఫ్ ని ఓ రేస్ లెక్క ఫీల్ అయిపోయి పరుగెత్తుతుంటారు.. కానీ కొందరు చిన్న జీవితాన్ని..ఇలా సింపుల్ గా ఎంజాయ్ చేస్తూ బతికేస్తున్నారు. మీకు కూడా ఇలాంటి థాట్స్ ఉన్నాయా..?
-Triveni Buskarowthu