అప్పుడప్పుడు కొన్ని దుస్తులపై మరకలు పడుతూ ఉంటాయి. అలాంటి వాటిని ఎంతో కష్టపడితే కానీ వదిలించుకోవడానికి అవ్వదు. కొన్ని కొన్ని సార్లు మనకి నచ్చిన దుస్తులు ఉంటాయి. వాటిని జాగ్రత్తగా వాష్ చేయకపోతే ఆ మరకలు పోవు. దుస్తులపై మరకలు పోవాలంటే ఈ ట్రిక్స్ ని ఫాలో అవ్వండి. దుస్తులపై లిప్స్టిక్ మరక పడినట్లయితే దానిపై కాస్త గ్లిజరిన్ రాసి అరగంట తర్వాత ఉతకాలి. ఇలా చేయడం వలన మరక ఈజీగా పోతుంది. అలాగే నిమ్మకాయ ముక్కని మరకపై రుద్దితే కూడా ఎంతో ప్రభావితంగా పనిచేస్తుంది. హైడ్రోజన్ పెరాక్సైడ్ బ్లడ్ లేదా తుప్పు మరకల్ని తొలగించడానికి ఎంతో ఎఫెక్టివ్ గా పని చేస్తుంది. కాబట్టి ఎప్పుడైనా మరకలు ఉన్నట్లయితే హైడ్రోజన్ పెరాక్సైడ్ ని ఉపయోగించవచ్చు.
హైడ్రోజన్ పెరాక్సైడ్ బ్లీచింగ్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఫ్యాబ్రిక్ రంగుని కోల్పోయేలా చేస్తుంది. అలాగే డిటర్జెంట్, స్టెయిన్ రిమూవల్ బట్టలు ఉతకడానికి ముందు వేసి స్క్రబ్ చేయడానికి ఉపయోగించవచ్చు. ఇలా చేస్తే కూడా ఎఫెక్టివ్ గా మరకలు పోతాయి. స్టెయిన్ రిమూవర్లు మొండి మరికల్ని ఈజీగా తొలగించేస్తాయి.
దుస్తులపై ఇనుము, తుప్పు మరక పడితే నీళ్లలో కొంచెం సాల్ట్ వేసి నానబెట్టాలి. ఆ తర్వాత మరకలు ఈజీగా పోతాయి. రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం మరకలపై వేసి డిటర్జెంట్ సబ్బుతో ఉతికితే కూడా మరకలు ఈజీగా పోతాయి. క్యచప్ మరక పడినట్లయితే డిటర్జెంట్ తో ఉతకండి. ఇలా ఈజీగా దుస్తులపై పడిన మరకలు తొలగించుకోవచ్చు.