సైబర్ నేరస్తుడి ఫోన్ కాల్.. ఒక్కసారిగా ఆగిన తల్లి గుండె!

-

సైబర్ నేరగాళ్ల మోసాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది.అక్రమంగా డబ్బులు కాజేయడమే కాకుండా వారి వేధింపులకు కొందరు అన్యాయంగా బలైపోతున్నారు. ఇటీవల కాలంలో వీడియో కాల్స్ చేసి అవతలి వారి ఫేస్‌ను స్క్రీన్ షాట్ తీసి వారు న్యూడ్ కాల్స్ మాట్లాడుతున్నట్లుగా చిత్రీకరించి డబ్బుల కోసం బ్లాక్ మెయిల్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇలా సైబర్ మోసగాళ్ల ఉచ్చులో చిక్కుకుని చాలా మంది డబ్బులు కోల్పోగా మరికొంత మంది సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.

ఇటువంటి ఘటనలు నగరంలో వందల సంఖ్యలో వెలుగుచూస్తున్నాయి.పెండింగ్ కేసులు కూడా కుప్పలుగా పేరుకుపోతున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు.ఈ క్రమంలోనే ఓ స్కామర్ చేసిన కాల్ వలన అన్యాయంగా ఓ తల్లి గుండె ఆగింది.ఆగ్రాలో ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్న మాల్తీ వర్మకు పోలీస్ ఫోటో డీపీతో ఓ స్కామర్ వాట్సాప్ కాల్ చేశాడు. నీ కూతురు సెక్స్ రాకెట్లో దొరికింది. రూ.లక్ష చెల్లిస్తే కేసు లేకుండా చేస్తానన్నాడు. కూతురి గురించి అలాంటి వార్త వినడంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆమె గుండె పోటుతో మరణించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version