ఎన్నో సందర్భాలలో ఇతరుల వ్యక్తిత్వం గురించి మరియు వారి ఆలోచనల గురించి తెలుసుకోవాలని చాలామంది అనుకుంటారు. అయితే సైకాలజీ ప్రకారం వాటిని కనుగొనాలి అంటే ఈ ట్రిక్స్ ను పాటిస్తే సరిపోతుంది. ఎంతో సులువుగా ఎదుటివారి ఆలోచనల గురించి తెలుసుకోవచ్చు మరియు వారి ప్రవర్తన గురించి పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యక్తిని ప్రశ్నించడం వలన ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. ఎలాంటి ప్రశ్నలకైతే ఎక్కువ మాట్లాడే అవకాశం ఉంటుందో అటువంటి ప్రశ్నలను అడగడం వలన ఎక్కువ సమయం మాట్లాడతారు. దాంతో ఎంతో సులువుగా అభిప్రాయాలను అర్థం చేసుకొని ఆలోచన విధానాన్ని కనిపెట్టవచ్చు.
ఎప్పుడైతే ఇతరులను అర్థం చేసుకోవాలని అనుకుంటారో కేవలం ఒక పరిస్థితులో మాత్రం కాకుండా వివిధ పరిస్థితులలో వారి ప్రవర్తన ఎలా ఉందో గమనించాలి. ఈ విధంగా గమనించడం వలన అసలు తీరు అనేది తెలుస్తుంది. ఒకరి ప్రవర్తన ఎలా ఉందో అర్థం చేసుకోవాలి అంటే కేవలం ఒక పరిస్థితి సరిపోదు. ఈ విధంగా ఇతరులను ఎంతో సులువుగా పరిశీలించి అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఇతరుల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి అని అనుకుంటారో ఆ వ్యక్తి చెప్పే మాటలను ఎంతో జాగ్రత్తగా వినాలి. వినడం వలన చాలా శాతం అర్ధం అవుతారు.
ఆ వ్యక్తి చెప్పే ప్రతి విషయాన్ని మరియు ఉపయోగించే పదాలని గమనించడం వలన పూర్తిగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కేవలం చెప్పిన మాటలు మాత్రమే కాకుండా బాడీ లాంగ్వేజ్ ప్రకారం కూడా ఇతరుల తత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటుగా ముఖ కవళికలు, భంగిమలు ప్రకారం కూడా ఎదుట వ్యక్తి తీరుని అర్థం చేసుకోవచ్చు. ఈ విధమైన ట్రిక్స్ ను పాటిస్తే ఎంతో సులువుగా ఎదుట వ్యక్తుల గురించి అర్థం చేసుకోవచ్చు మరియు వారి ప్రవర్తనల ప్రకారం ఆలోచన తీరు, నడిచే పద్ధతి కనిపిస్తుంది. దీంతో ఎంతో సులువుగా ఆలోచనా విధానాన్ని అంచనా వేయవచ్చు.