అసెంబ్లీ లో ఎస్సీ వర్గీకరణ తీర్మానం ను స్వాగతిస్తున్నాం అని BRS MLA కేటీఆర్ అన్నారు. అలాగే బిసి లపై ప్రభుత్వ వైఖరి ని నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నాం అని కూడా పేర్కొన్నారు కేటీఆర్. అయితే అసెంబ్లీ లో కేటీఆర్ మాట్లాడుతూ.. బీసీల సంఖ్యను ఐదు శాతం తగ్గించి బీసీల గొంతు కోసిన ప్రభుత్వ కుట్రను నిరసనగా వాకౌట్ చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం బీసీ జనాభాను తగ్గించిన తీరును రాష్ట్రంలోని బలహీన వర్గాలందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారి వాదనను, భాదను అసెంబ్లీలో తెలుపుదామంటే ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు.
బలహీన వర్గాల అంశానికి సంబంధించి బలహీన వర్గాల వాదనను అసెంబ్లీలో వినిపించేందుకు అవకాశం ఇవ్వలేదు. బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన దగాను మోసాన్ని… గొంతు కోసిన తీరును నిరసిస్తూ శాసనసభ నుంచి వాకౌట్ చేస్తున్నాము అని అసెంబ్లీ నుంచి మొతం BRS ఎమ్మెల్యేలు వాకౌట్ చేసి వెళ్లిపోయారు.