నాలుక మీద మచ్చలు ఉంటే.. అన్నవి నిజం అయిపోతాయా..?

-

కొంత మందికి నాలుక మీద మచ్చలు ఉంటాయి. నాలుక మీద మచ్చలు ఉంటే వాళ్ళు ఏం చెప్తే అది జరిగిపోతాయని అంటూ ఉంటారు. ఈ విషయాన్ని మనం చాలా సార్లు చూసే ఉంటాం. సినిమాల్లో కూడా మనకి ఇలాంటి సన్నివేశాలు కనబడుతుంటాయి. మరి నిజంగా నాలుగు మీద మచ్చలు ఉంటే వాళ్ళు చెప్పేవి జరిగిపోతాయా.. అది నిజమా కాదా అనే విషయానికి వచ్చేస్తే.. పుట్టుమచ్చల శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నాలుక మీద మచ్చలు ఉన్నవాళ్లకి వాక్ సిద్ది ఉంటుంది అని పండితులు అంటున్నారు.

 

సరస్వతి దేవి ఉపాసన తరతరాల్లో బాగా చేసి ఉన్నా సరస్వతి దేవి కటాక్షం వున్నా నాలుగు మీద అమ్మవారి ఐం బీజాక్షరము రాసి ఉంటుంది దాన్నే పుట్టుమచ్చలుగా చెప్తారు పెద్దలు. అయితే మంచి చెడు ఇందులో రెండు ఉంటాయి. చెడుకి సంబంధించినవి ఎక్కువగా మాట్లాడితే గౌరవం లభించదు.

అదే ఒకవేళ దైవానుగ్రహం కనుక పెరగాలంటే మంచి మాట్లాడాలి సత్యాన్ని మాట్లాడితే అమ్మ వారి కటాక్షం లభిస్తుంది దైవానుగ్రహం కూడా బాగా పెరిగి మంచి జరుగుతుంది. అదే ఒకవేళ అబద్ధాలు చెప్తే శక్తి ఉండదు. గౌరవం కూడా లభించదు పుట్టుమచ్చల శాస్త్రం ప్రకారం నాలుక మీద ఉండే మచ్చల గురించి నిజం ఇది, ఈసారి మీకు కూడా అర్థమైంది కదా నాలుగు మీద పుట్టుమచ్చలు అంటే ఏంటి.. నిజంగా జరిగిపోతాయా లేదా అనేది.

Read more RELATED
Recommended to you

Exit mobile version